Deepa Pauline Jessica : త‌మిళ న‌టి పౌలిన్ జెస్సికా ఆత్మ‌హ‌త్య

చెన్నై ఫ్లాట్ లో ఉరి వేసుకున్న న‌టి

Deepa Pauline Jessica : సినీ రంగానికి సంబంధించి న‌టులు ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డుతుండ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది. తాజాగా త‌మిళ న‌టి దీపా అకా పౌలిన్ జెస్సికా(Deepa Pauline Jessica)  ఆత్మ‌హ‌త్య చేసుకుంది.

దీంతో త‌మిళ సినిమా రంగంలో క‌ల‌క‌లం రేపింది. త‌న మ‌ర‌ణానికి విఫ‌ల సంబంధమే ప్ర‌ధాన కార‌ణ‌మ‌ని సూసైడ్ నోట్ లో పేర్కొంది. ఆమె సూసైడ్ పై పోలీసులు విచార‌ణ చేప‌ట్టారు.

చెన్నై ఫ్లాట్ లో ఉరి వేసుకుని ఉండ‌డం క‌నిపించంది. ఇదిలా ఉండ‌గా సెప్టెంబ‌ర్ 18న చెన్నై లోని విరుగంబాక్కం మ‌ల్లికా అవెన్యూ లోని త‌న అద్దె ఫ్లాట్ లో శ‌వ‌మై క‌నిపించంది.

దీపా అకా పౌలిన్ జెస్సికా ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రానికి చెందిన వ్య‌క్తి. దీపా అని పిలువ‌బ‌డే పౌలిన్ జెస్సికా ఇటీవ‌ల విడుద‌లైన త‌మిళ చిత్రం వైధాలో ప్ర‌ధాన పాత్ర పోషించింది.

అంతే కాకుండా ఆమె ప‌లు త‌మిళ సినిమాలు, స‌రియ‌ల్స్ లో ప‌ని చేసింది. అంత‌కు ముందు కోయంబేడు పోలీసులు న‌టి మ‌ర‌ణానికి సంబంధించి పొరుగు వారి నుండి స‌మాచారం అందుకున్నారు.

ఆ వెంట‌నే ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని ద‌ర్యాప్తు చేశారు. మృత దేహాన్ని శ‌వ ప‌రీక్ష నిమిత్తం కిల్పాక్ ప్ర‌భుత్వ వైద్య కాలేజీ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. అనంత‌రం దీపా బంధువులకు స‌మాచారం అందించారు.

న‌టి దీపా జెస్సికా(Deepa Pauline Jessica)  మృత దేహాన్ని ఏపీకి త‌ర‌లించారు. ప్ర‌ముఖ న‌టి పౌలిన్ జెస్సికా ఆత్మ‌హ‌త్య‌పై అన్ని వైపుల‌నుంచి విచార‌ణ జ‌రుపుతున్నామ‌ని , సీసీటీవీ సాయం తీసుకుంటున్నామ‌ని పోలీసులు వెల్ల‌డించారు.

Also Read : అలియా భ‌ట్ పై అసూయతోనే విమ‌ర్శ‌లు

Leave A Reply

Your Email Id will not be published!