Electricity Bill Comment : కేంద్ర విద్యుత్ బిల్లు ఎవ‌రి కోసం

జ‌నం నెత్తిన మ‌రో గుదిబండ

Electricity Bill Comment : ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను గాలికి వ‌దిలేసి ఫ‌క్తు వ్యాపార‌వేత్త‌లు, కార్పొరేట‌ర్ల‌కు వంత పాడుతూ ప్ర‌భుత్వ రంగ సంస్థ‌ల‌ను గంప గుత్త‌గా అమ్ముకుంటూ వెళుతున్న మోదీ స‌ర్కార్ మ‌రో షాక్ ఇచ్చేందుకు రెడీ అయ్యింది.

ప్రైవేట్ సంస్థ‌ల‌కు విద్యుత్ రంగాన్ని అప్ప‌గించేందుకు పావులు క‌దుపుతోంది. ఇందులో భాగంగా కొత్త విద్యుత్ బిల్లు చ‌ట్టంగా తీసుకు రానుంది. ఇదే గ‌నుక చ‌ట్టంగా వ‌స్తే ఇక దోపిడీదారుల‌కు, సంస్థ‌ల‌కు అడ్డు అదుపు లేకుండా పోతోంది.

విద్యుత్ స‌ర‌ఫ‌రా అన్న‌ది మ‌న చేతుల్లో ఉండ‌దు. రాష్ట్రాల ప‌రిధి నుంచి తీసేసి పూర్తిగా కార్పొరేట‌ర్ల‌కు అప్ప‌గించే దురుద్దేశ పూర్వ‌క‌మైన ఆలోచ‌న‌కు శ్రీ‌కారం చుట్టింది మోదీ స‌ర్కార్.

ఈ చ‌ట్టానికి ఆమోద ముద్ర ల‌భిస్తే ఇక సామాన్యు వినియోగ‌దారుల‌కు చుక్క‌లే. ఇప్ప‌టికే దేశాన్ని ద్ర‌వ్యోల్బ‌ణం, నిరుద్యోగం ప‌ట్టి పీడిస్తోంది. ఇదే

స‌మ‌యంలో పెట్రోల్, గ్యాస్, నిత్యావ‌స‌రాల ధ‌ర‌లు కొండెక్కాయి.

ఏ ఒక్క దానిపై కూడా కేంద్ర త‌న నియంత్ర‌ణ‌ను క‌లిగి ఉండ‌డం లేదు. మొన్న‌టికి మొన్న క‌రోనా పేరుతో జ‌నం నెత్తిన గుదిబండ వేసిన బీజేపీ ప్ర‌భుత్వం అన్నింటిని ప్రైవేట్ ప‌రం చేసేందుకు పావులు క‌దుపుతోంది.

కొత్త విద్యుత్ చ‌ట్టంలో పూర్తిగా వినియోగ‌దారుల‌కు ఎంత మాత్రం ర‌క్ష‌ణ అంటూ ఉండ‌దు. అధికంగా పేద‌లు, మ‌ధ్య త‌ర‌గ‌తి ప్ర‌జ‌లు, రైతులు, స‌బ్సిడీ

పొందుతున్న వారిపై ఎక్కువ‌గా ప్ర‌భావం ఉంటుంది.

ఇప్ప‌టికే అత్యంత బ‌రువుగా మారిన వ్య‌వసాయ రంగం మ‌రింత భారంగా మార‌నుంది. ఇక ఇంత కాలం రాష్ట్రాల ప‌రిధిలో ఉన్న విద్యుత్ నియంత్ర‌ణ

మండ‌లి (ఈఆర్సీ) ఇక నుంచి కేంద్రం చేతుల్లోకి వెళ్ల‌నుంది.

ఇలా గ‌నుక జ‌రిగితే విద్యుత్ అన్న‌ది అర చేతిలో స్వ‌ర్గం గాలిలో దీపం లాగా మారిపోతుంది. కొత్త స్కీం ఆశ చూపి ఆ త‌ర్వాత ఊహించ‌ని స్థాయిలో బిల్లుల మోత మోగ‌నుంది.

ఇప్ప‌టికే విద్యుత్ బిల్లులు(Electricity Bill)  త‌డిసి మోప‌డ‌వుతున్నాయి. వీటిపై అజ‌మాయిసీ లేకుండా పోయింది. అంతే కాకుండా న‌ష్టాల పేరుతో

స‌బ్సిడీ క‌రెంట్ కు కేంద్ర స‌ర్కార్ ఈ చ‌ట్టం ద్వారా మంగ‌ళం పాడ‌నుంది.

నూత‌న చ‌ట్టం గ‌నుక అమ‌లులోకి వ‌స్తే ప్ర‌తి ఒక్క‌రూ కేంద్రం నిర్దేశించిన ఆధారంగా క‌రెంట్ బిల్లులు చెల్లించాల్సి వ‌స్తుంది. నెల‌కు రూ. 100 బిల్లు వ‌చ్చే

వినియోగ‌దారుడు రూ. 1000 కూడా చెల్లించాల్సి వ‌చ్చే ప్ర‌మాదం పొంచి ఉంది.

సంస్క‌ర‌ణ‌ల పేరుతో విద్యుత్ రంగాన్ని త‌న చేతుల్లోకి తీసుకుని అదానీ, అంబానీ లాంటి బ‌డా కార్పొరేట్ల‌కు అప్ప‌గించే ప్లాన్ లో ఉన్నారు మోదీ.

ఏది ఏమైనా ప్రైవేట్ రంగంలో ప్ర‌జ‌ల‌కు సేవ చేయ‌డం అంటూ ఉండ‌దు. ఇక‌నైనా కేంద్రం త‌న నిర్ణ‌యాన్ని మార్చుకోవాలి. ప్ర‌జ‌ల నెత్తిన మ‌రో గుదిబండ కాకుండా చూడాల్సిన బాధ్య‌త మోదీపై ఉంది.

Also Read : అభివృద్ది నిరోధ‌కుల ప‌ట్ల జాగ్ర‌త్త – మోదీ

Leave A Reply

Your Email Id will not be published!