Chiranjeevi : గరికపాటి సీరియస్ చిరంజీవి సారీ
ఫ్యాన్స్ సెల్ఫీలపై ఆగ్రహం
Chiranjeevi : పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. ఎవరి ఆధిపత్యం వద్దని పోరాటం చేశామో మళ్లీ వారే అన్ని రంగాలలో తమదైన ముద్ర కనబరుస్తున్నారు. ప్రతి ఏటా హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ అలయ్ బలయ్ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.
ఈ ఏడాది 2022 కూడా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. హైదరాబాద్ లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో దత్తన్న అలయ్ బలాయ్ చేపట్టారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ అవధాని, సాహితీవేత్త గరికపాటి నరసింహారావుతో(Garikipati Narasimha Rao) పాటు మెగాస్టార్ చిరంజీవి కూడా హాజరయ్యారు. పెద్ద ఎత్తున అభిమానులు చిరంజీవితో ఫోటోలు తీసుకునేందుకు పోటీ పడ్డారు.
దీనిపై తీవ్రంగా స్పందించారు గరికపాటి నరసింహారావు. విజయ దశమి సందర్భంగా చేపట్టిన అలయ్ బలయ్ లో చోటు చేసుకున్న అసౌకర్యానికి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు గరికపాటి. అభిమానం ఉండడం మంచిదే. కానీ ఇలాంటి అత్యుత్సాహం మంచిది కాదని పేర్కొన్నారు. ఫ్యాన్స్ కోరికను మన్నించి సెల్ఫీలు దిగారు చిరంజీవి(Chiranjeevi).
ఇదిలా ఉండగా వేదికపై గరికపాటి నరసింహారావు ప్రసంగిస్తుండగా మెగాస్టార్ అభిమానులు రెచ్చి పోయారు. గరికపాటి దీనిని ప్రత్యేకంగా ప్రస్తావించి వేదికపైకి రావాలని కోరారు. దయచేసి ఫోటో సెషన్ ఆపి పైకి రండి లేదంటే నన్ను బయలు దేరేందుకు అనుమతి ఇవ్వండని అన్నారు.
నిర్వాహకులు శాంతింప చేసే ప్రయత్నం చేశారు. చివరకు చిరంజీవి ఫోటో సెషన్ ను ఆపేసి గరికపాటికి క్షమాపణలు చెప్పారు. చివరకు మెగాస్టార్ సారీ చెప్పడంతో శాంతించారు గరికపాటి.
Also Read : పవర్ స్టార్ పై గాడ్ ఫాదర్ కామెంట్