Vetrimaaran : వెట్రిమార‌న్ కామెంట్స్ క‌ల‌క‌లం

చోళుల కాలంలో మ‌తం లేదు

Vetrimaaran : వెట్రిమార‌న్ మోస్ట్ పాపుల‌ర్ ద‌ర్శ‌కుడు. భార‌తీయ సినిమా రంగంలో త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్ ను స్వంతం చేసుకున్నారు. చోళ రాజుల కాలంలో హిందూ మ‌తం అన్న‌ది లేద‌న్నారు వెట్రిమార‌న్(Vetrimaaran). హిందూ మ‌తం అనే పేరు అప్పుడు ఉండేది కాద‌ని స్ప‌ష్టం చేశారు.

అప్ప‌ట్లో వైష్ణ‌వులు, శైవులు ఉండేవార‌ని హిందూ అనే ప‌దం ఆనాడు లేద‌ని కానీ హిందూ ప‌దాన్ని ఆంగ్లేయులు ఉప‌యోగించారంటూ పేర్కొన్నాడు.

ఇక ద‌ర్శ‌కుడు వెట్రిమార‌న్ చేసిన ప్ర‌స్తుత వ్యాఖ్య‌లు తీవ్ర దుమారం రేపాయి. దేశ వ్యాప్తంగా చ‌ర్చ‌కు దారి తీశాయి. భార‌తీయ జ‌న‌తా పార్టీ తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేసింది.

వెట్రిమార‌న్ కు దిగ్గ‌జ న‌టుడు క‌మ‌ల్ హాస‌న్(Kamal Hassan) మ‌ద్ద‌తు తెలిపారు. ద‌ర్శ‌కుడు అన్న దాంట్లో త‌ప్పు లేద‌ని, వాస్త‌వం ఉంద‌న్నారు. పాత ఇంట‌ర్వ్యూ లో క‌మ‌ల్ హాస‌న్ చేసిన ఇంట‌ర్వ్యూ ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైల‌ర్ గా మారింది.

ఒక‌ప్పుడు తాను క్రీస్తు వాక్యాన్ని ప్ర‌పంచానికి చాటే వాడిన‌ని అన్నారు. ఇదిలా ఉండ‌గా చోళ వంశానికి చెందిన రాజు జీవితం ఆధారంగా తెర‌కెక్కిన పొన్నియ‌న్ సెల్వ‌న్ -1 సినిమా దేశ వ్యాప్తంగా మంచి ఆద‌ర‌ణ పొందింది.

ఈ చిత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా బాక్సాఫీస్ క‌లెక్ష‌న్ల వ‌ద్ద రూ. 400 కోట్ల‌కు పైగా వ‌సూలు చేసింది. ఇదే సినిమాలో రాజ రాజ చోళ గురించి కూడా చ‌ర్చ జ‌రిగింది. మొద‌టి రాజ రాజ చోళుడు ఈ సామ్రాజ్యంలోని అత్యంత మ‌హిమాన్విత‌మైన రాజుల‌లో ఒక‌డు.

Also Read : చోళుల కాలంలో హిందూ మ‌తం లేదు

Leave A Reply

Your Email Id will not be published!