PM Modi Amitabh : అమితాబ్..క‌ల‌కాలం జీవించు – మోదీ

బిగ్ బికి ప్ర‌ధాన‌మంత్రి బ‌ర్త్ డే గిఫ్ట్

PM Modi Amitabh : భార‌త‌దేశం గ‌ర్వించ‌ద‌గిన న‌టుడు బిగ్ బి అమితాబ్ బ‌చ్చ‌న్ పుట్టిన రోజు ఇవాళ‌. ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ ప్ర‌త్యేకంగా బ‌ర్త్ డే(PM Modi Amitabh) గ్రీటింగ్స్ తెలిపారు. ట్విట్ట‌ర్ వేదిక‌గా అమితాబ్ ను ఉద్దేశించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. రిమార్క‌బుల్ ఫిల్మ్ ప‌ర్స‌నాలిటీ అని ప్ర‌శంసించారు.

నేటితో అమితాబ్ బ‌చ్చ‌న్ 80వ వ‌సంతంలోకి అడుగు పెట్టారు. త‌ర‌త‌రాలుగా ప్రేక్ష‌కుల‌ను మెప్పించారు. ఇంకా న‌టిస్తూనే ఉన్నారు. సినీ రంగంలో మ‌రిన్ని విజ‌యాలు సాధించాల‌ని, సుదీర్ఘ‌మైన‌, ఆరోగ్య‌వంత‌మైన జీవితాన్ని గ‌డ‌పాల‌ని ప్ర‌ధాన‌మంత్రి కోరారు. ప్ర‌ముఖ న‌టుడి కూతురు శ్వేతా బ‌చ్చ‌న్ కూడా త‌న గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ కి హృద‌య పూర్వ‌క సందేశం తెలిపారు.

ఇదిలా ఉండ‌గా శ్వేత త‌న తండ్రితో గ‌డిపిన చిన్న‌నాటి జ్ఞాప‌కాల‌తో పాటు అమితాబ్ బ‌చ్చ‌న్ పేరెంట్స్ , హ‌ర్వాన్స్ రాయ్ బ‌చ్చ‌న్ , తేజీ బ‌చ్చ‌న్ ల‌తో గ‌డిపిన ఫోటోల‌ను పంచుకున్నారు. ఆమె అబిదా ప‌ర్వీన్ , న‌సీబో లాల్ తూ ఝామ్ పాటతో కూడిన సాహిత్యాన్ని కూడా పేర్కొంది.

ఇందులో స‌బ్ ను న‌మాజ్ కేకి క‌ర్ణా ఆయే దిల్ ను ఎహ్ సంఝ‌వ‌న్ ..తూ తూ ఝూమ్ ఝూమ్ ఝూమ్ ఝూమ్ తూ ఝూమ్ ఝూమ్ ఝూమ్ ఝూమ్ ..నా గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ 80వ పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు అని రాసింది. అంతే కాకుండా శ్వేతా బ‌చ్చ‌న్ కూతురు న‌వ్య కూడా నానా (తాత‌) కోసం హ‌రి వంశ్ రాయ్ బ‌చ్చ‌న్ రాసిన ప‌ద్యం అగ్ని ప‌థ్ లోని పంక్తుల‌ను ప్ర‌స్తావించింది.

మీలాంటి వారు ఎన్న‌డూ ఉండ‌రు. ఎప్ప‌టికీ ఉండ‌రంటూ బ‌ర్త్ డే గ్రీటింట్స్ అంటూ పేర్కొంది.

Also Read : స‌మ ఉజ్జీల పోరులో విజేత ఎవ‌రో

Leave A Reply

Your Email Id will not be published!