Babar Azam : నాయ‌క‌త్వంపై విమ‌ర్శ‌లు స‌హ‌జం

పాకిస్తాన్ కెప్టెన్ బాబ‌ర్ ఆజ‌మ్ కామెంట్స్

Babar Azam : పాకిస్తాన్ కెప్టెన్ బాబ‌ర్ ఆజ‌మ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. త‌న నాయ‌క‌త్వం వ‌రుస‌గా విమ‌ర్శ‌లు వెల్లువెత్తడంపై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. గురువారం బాబ‌ర్ ఆజ‌మ్ మీడియాతో మాట్లాడాడు. తాను ఎంత సేపు జ‌ట్టుపై ఫోక‌స్ పెడ‌తాన‌ని కానీ ఇత‌ర విష‌యాలు, ఆరోప‌ణ‌ల గురించి ప‌ట్టించు కోనంటూ స్ప‌ష్టం చేశాడు.

మిమ్మ‌ల్ని మారుస్తార‌ని ఈ మ‌ధ్య చ‌ర్చ జ‌రుగుతోంద‌ని ఓ జ‌ర్న‌లిస్ట్ అడిగిన ప్ర‌శ్న‌కు న‌వ్వి ఊరుకున్నారు. కెప్టెన్ అన్న‌ది చాలా బాధ్య‌త‌తో కూడుకుని ఉన్న‌ది. ఓ వైపు జ‌ట్టును స‌మ‌న్వ‌యం చేసుకోవాలి. మ‌రో వైపు న‌న్ను నేను ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. కానీ స‌మ‌యం తీరిక ఉండ‌ద‌న్నాడు.

విజ‌యాలు సాధించిన‌ప్పుడు ఎవ‌రూ ఏమీ అన‌ర‌ని కానీ ఒక్క‌సారిగా ఓడి పోతే విమ‌ర్శ‌లు వెల్లువ‌లా వ‌స్తుంటాయ‌ని పేర్కొన్నాడు బాబ‌ర్ ఆజ‌మ్. ప్ర‌స్తుతం త‌మ జ‌ట్టుకు ఫుల్ ప్రాక్టీస్ దొరుకుతోంద‌న్నాడు. త‌న ఫోక‌స్ అంతా ఆస్ట్రేలియా వేదిక‌గా అక్టోబ‌ర్ 16 నుంచి ప్రారంభం కానున్న టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ మీదే ఉంద‌న్నాడు పాకిస్తాన్ కెప్టెన్(Babar Azam).

ఇక వేటి గురించీ తాను ఆలోచించ‌డం లేద‌ని స్ప‌ష్టం చేశాడు. తాను ఏనాడూ కెప్టెన్ ప‌ద‌వి కోసం పాకులాడ లేద‌ని పేర్కొన్నాడు. అలాంటి ఆశ కూడా లేద‌న్నాడు. త‌న ముందున్న‌ది ఒక్క‌టే పాకిస్తాన్ జ‌ట్టుకు ఎన‌లేని విజ‌యాలు సాధించి పెట్టాల‌ని. అదే త‌న ముందున్న టార్గెట్ అని కుండ బ‌ద్ద‌లు కొట్టాడు.

ఇదిలా ఉండ‌గా త‌న‌కు టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ ఆఖ‌రు అని వ‌స్తున్న వార్త‌ల‌ను తోసి పుచ్చాడు. ఉంచుతారో లేదా అన్న‌ది పీసీబీ నిర్ణ‌యం మీద ఆధార‌ప‌డి ఉంటుంద‌న్నాడు.

Also Read : ఆసియా క‌ప్ ఫైన‌ల్ కు భార‌త్

Leave A Reply

Your Email Id will not be published!