Unstoppable NBK : బాల‌య్య షోకి భారీగా వ్యూస్

ఓటీటీలో అరుదైన రికార్డ్

Unstoppable NBK : టాలీవుడ్ లో డైలాగ్ డెలీవ‌రిలో త‌న‌కంటూ ఓ స్పెష‌ల్ ఇమేజ్ ను స్వంతం చేసుకున్నారు న‌టుడు నంద‌మూరి బాల‌కృష్ణ‌. ఆయ‌న‌ను అంతా అభిమానులు బాల‌య్య అని పిలుచుకుంటారు. బాల‌య్య‌తో అల్లు అర‌వింద్ సంస్థ ఆహా ప్రారంభించిన్ అన్ స్టాప‌బుల్ రియాల్టీ షో ఇప్పుడు అన్నింటిని మించి ఆద‌ర‌ణ‌ను చూర‌గొంటోంది.

తాజాగా టెలికాస్ట్ అయిన మొద‌టి ఎపిసోడ్ ఊహించ‌ని రీతిలో వ్యూస్ సంపాదించింది. ఇది బాల‌య్య‌కు ఉన్న స్టామినా ఏమిటో (Unstoppable NBK) ప‌వ‌ర్ ఏమిటో మ‌రోసారి తెలియ చేసింది. ప‌లువురు న‌టులు ప్ర‌య‌త్నాలు చేసినా ఎందుక‌నో బాల‌య్య వేవ్ లో రాణించ లేక పోయారన్న విమ‌ర్శ‌లు ఉన్నాయి.

ఇక బిగ్ బాస్ తో అక్కినేని నాగార్జున మ‌రోసారి మ‌న్మ‌ధుడిలా అల‌రిస్తూ ర‌క్తి క‌ట్టిస్తున్నారు. దీనిపై సీపీఐ నారాయ‌ణ లాంటి వాళ్లు క‌స్సుమంటున్నారు. అది బిగ్ బాస్ షో కాద‌ని బూతు షో అని ఆయ‌న సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కానీ బాల‌య్య బాబు అన్నీ తానే అయి చేస్తున్న ఎన్బీకే షో మాత్రం సూప‌ర్ అంటున్నారు చూసిన వాళ్లు.

అన్ని వ‌ర్గాల వారిని అల‌రిస్తూ వ‌స్తోంది. అప్పుడ‌ప్పుడు పంచులు, ప్రాస‌లు, డైలాగుల‌తో ఆక‌ట్టుకుంటూ దూసుకు పోతున్నారు బాల‌య్య‌. ఇదిలా ఉండ‌గా 24 గంట‌ల్లో ఏకంగా 10 ల‌క్ష‌ల వ్యూస్ సంపాదించిందంటూ ఆహా తెలిపింది.

ఈసారి షో ప్ర‌త్యేక‌త ఏమిటంటే త‌న బావ మాజీ సీఎం చంద్ర‌బాబు నాయుడు , అల్లుడు లోకేష్ తో క‌లిసి చేసింది కావ‌డం విస్తు పోయేలా చేసింది.

Also Read : మ‌లాలాకు ప్రియాంక చోప్రా మ‌ద్ద‌తు

Leave A Reply

Your Email Id will not be published!