Rani Chatterjee : ఛాన్స్ ఇస్తానంటూ వాడుకున్నాడు

సాజిద్ ఖాన్ పై న‌టి రాణీ ఛ‌ట‌ర్జీ

Rani Chatterjee : బాలీవుడ్ నిర్మాత సాజిద్ ఖాన్ పై ఆరోప‌ణ‌లు వెల్లువెత్తుతున్నాయి. ఇప్ప‌టికే మీటూ కింద మ‌హిళ‌లు త‌మ‌ను లైంగికంగా వేధింపుల‌కు గురి చేశాడంటూ ఆరోపించారు. ఈ మేర‌కు ఢిల్లీ విమెన్స్ క‌మిష‌న్ కు ఫిర్యాదు కూడా చేశారు. గ‌తంలో ఆయ‌న‌పై సినీ రంగానికి చెందిన వారు కూడా విమ‌ర్శ‌లు చేశారు.

ఇదిలా ఉండ‌గా తాజాగా భోజ్ పురికి చెందిన ప్ర‌ముఖ న‌టి రాణి ఛ‌ట‌ర్జీ(Rani Chatterjee)  సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. త‌న‌కు సినిమాలో ఐటెం సాంగ్ చేసేందుకు ఛాన్స్ ఇప్పిస్తాన‌ని చెప్పాడ‌ని, ఆ త‌ర్వాత మోసం చేశాడ‌ని ఆరోపించారు. అంతే కాదు త‌న‌ను వాడుకున్నాడంటూ వాపోయింది.

ఆమె ఓ జాతీయ ఛాన‌ల్ తో మాట్లాడుతూ ఈ ఆరోప‌ణ‌లు చేయ‌డం గ‌మ‌నార్హం. సాజిద్ ఖాన్ మేక వ‌న్నె పులి అని, ఇంకా ఎంతో మందిని సినిమాల‌లో అవ‌కాశాల పేరుతో వాడుకుంటూ మోసం చేస్తున్నాడంటూ వాపోయింది రాణి ఛ‌ట‌ర్జీ. ఇదిలా ఉండ‌గా రాణి ఛ‌ట‌ర్జీ ప‌లు బాలీవుడ్ సినిమాల్లో న‌టించింది.

ఇప్ప‌టికే ప‌లువురు హీరోయిన్లు ప‌లుమార్లు సాజిద్ ఖాన్ ప్ర‌వ‌ర్త‌న గురించి బ‌హిరంగంగానే ఆరోప‌ణ‌లు గుప్పించారు. ఇదిలా ఉండ‌గా సాజిద్ ఖాన్ ప్ర‌స్తుతం బిగ్ బాస్ లో పాల్గొంటుండ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఆయ‌న‌ను అందులో పాల్గొన‌కుండా నిషేధం విధించాల‌ని కేంద్ర స‌మాచార శాఖ మంత్రికి లేఖ రాశారు ఢిల్లీ మ‌హిళా క‌మిష‌న్ చైర్ ప‌ర్స‌న్ స్వాతి మ‌లివాల్(Swati Maliwal).

కాగా ఆమెను దూషిస్తూ ఇంటిపై దాడికి పాల్ప‌డ్డారు. తాజాగా రాణి చ‌ట‌ర్జీ చేసిన కామెంట్స్ తో ఇప్పుడు మ‌రోసారి వార్త‌ల్లో నిలిచాడు సాజిద్ ఖాన్.

Also Read : క‌న్న‌డ మూవీపై ఆర్జీవీ కామెంట్స్

Leave A Reply

Your Email Id will not be published!