Deepika Padukone : టాప్ 10 సుందరీమ‌ణుల్లో దీపికా ప‌దుకోణె

అరుదైన ఘ‌న‌త సాధించిన బాలీవుడ్ న‌టి

Deepika Padukone : ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టి దీపికా ప‌దుకోణె(Deepika Padukone) అరుదైన ఘ‌న‌త సాధించింది. ప్ర‌పంచ వ్యాప్తంగా టాప్ 10 సుంద‌రీమ‌ణుల జాబితాలో చోటు ద‌క్కించుకుంది. భార‌త దేశం నుంచి ఎంపికైన ఏకైక న‌టి దీపికా ప‌దుకోణె కావ‌డం విశేషం. ఇదిలా ఉండ‌గా ఈ న‌టి ఎవ‌రో కాదు ప్ర‌ముఖ బ్యాడ్మింట‌న్ క్రీడాకారుడు ప్ర‌కాశ్ ప‌దుకోణెకు స్వ‌యంగా కూతురు. స‌హ న‌టుడు ర‌ణ్ వీర్ సింగ్ ను పెళ్లి చేసుకుంది.

ఇటు బాలీవుడ్ లో బిజీగా ఉన్న దీపికా ప‌దుకోణే త‌న తోటి న‌టీమ‌ణి ప్రియాంక చోప్రా లాగానే హాలీవుడ్ లో కూడా న‌టించింది అక్క‌డ కూడా న‌ట‌న ప‌రంగా ఫుల్ మార్కులు కొట్టేసింది. కెరీర్ ప‌రంగా కొన్ని చిత్రాల‌లో న‌టించినా త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్ ను స్వంతం చేసుకుంది దీపికా ప‌దుకోణె. న‌ట‌న‌, అందం, అభిన‌యంతో ఆమెకు వేలాది మంది ఫ్యాన్స్ ఉన్నారు. నెట్టింట్లో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

ప్ర‌తి ఏటా హాలీవుడ్ కు సంబంధించిన ఓ సంస్థ టాప్ 10 సుంద‌రీమ‌ణుల‌ను ఎంపిక చేస్తుంది. ఈ పోటీలో క‌ళ్లు, ముక్కు, పెద‌వులు, ఇత‌ర శ‌రీరానికి సంబంధించిన ఆకృతుల‌ను బ‌ట్టి అంచ‌నా వేస్తుంది. టాప్ 10 జాబితాకు సంబంధించి ప్ర‌పంచ వ్యాప్తంగా స‌ద‌రు సంస్థ స‌ర్వే చేప‌ట్టింది.

ఇందులో దీపికా ప‌దుకోణే(Deepika Padukone) ఏకంగా 91.22 శాతం సాధించి చోటు ద‌క్కించుకుంది. మొత్తం ప‌ది మందిలో ఆమె 9వ స్థానంలో నిలిచింది. దీపికా ఎంపిక కావ‌డం ప‌ట్ల బాలీవుడ్ సంతోషం వ్య‌క్తం చేసింది.

Also Read : ఛాన్స్ ఇస్తానంటూ వాడుకున్నాడు

Leave A Reply

Your Email Id will not be published!