Amit Shah : అందరి కళ్లు ట్రబుల్ షూటర్ పైనే
అట్టడుగు నుంచి అత్యున్నత స్థాయికి
Amit Shah : అమిత్ చంద్ర షా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. ఎందుకంటే చిన్నారుల నుంచి పెద్దల దాకా ఇట్టే గుర్తు పడతారు. ఠక్కున సమాధానం కూడా చెప్పేస్తారు. అంతలా పాపులర్ అయ్యారు అమిత్ షా(Amit Shah). ఇవాళ దేశ వ్యాప్తంగా ఆక్టోపస్ లాగా అల్లుకు పోయిన భారతీయ జనతా పార్టీ వెనుక ఆయన ఉన్నారనేది నగ్న సత్యం.
ప్రస్తుతం అమిత్ షా కనుసన్నలలోనే పార్టీ నడుస్తోంది. కింది స్థాయి నుంచి పై స్థాయి దాకా ఎవరైనా ఆయనను ప్రసన్నం చేసుకోవాల్సిందే. అందుకే పార్టీ పరంగా కానీ పాలనా పరంగా కానీ మోస్ట్ పాపులర్ లీడర్ గా ఎదిగారు.
అమిత్ చంద్ర షాను కాదని ఎవరూ ఏ పని చేయలేరు. ప్రస్తుతం ఒన్ మ్యాన్ షోగా నడుస్తోందంటే నమ్మలేం. అంతలా తన కంట్రోల్ లోకి తీసుకున్నారు షా.
వ్యూహాలు పన్నడంలో ఎదుటి వాళ్లు ఎంత శక్తిమంతులైనా సరే తన ఆధీనంలోకి తెచ్చుకోవడం షాకు వెన్నతో పెట్టిన విద్య. అందుకే పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు లేదా ప్రత్యర్థులను దెబ్బ కొట్టాలంటే ఈ ట్రబుల్ షూటర్ ఉండాల్సిందే. ఎత్తులకు పై ఎత్తులు వేయడంలో తనకు మించిన వారు ఎవరూ లేరు ఇప్పుడు బీజేపీలో.
ఒక రకంగా చెప్పాలంటే గతంలో బీజేపీ అంటే అటల్ బిహారీ వాజ్ పేయి, అద్వానీ, జోషి పేర్లు వినిపించేవి. ఇప్పుడు అద్వానీ ఉన్నా లేనట్టే. ఇక ఇప్పుడు మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా(JP Nadda) త్రయం నడుస్తోంది.
మొత్తంగా మోదీని కాదని అమిత్ షా ఏదీ చేయడు. అమిత్ షా చెప్పింది మోదీ ఏదీ కాదనడు.
అందుకే ఒకరు ఆదేశిస్తే మరొకరు కార్యక్షేత్రంలో పని సక్సెస్ అయ్యేలా చేస్తారు. ఇప్పుడు దేశమనే రథాన్ని నడిపిస్తున్నది ఎవరంటే ఒకరు మోదీ అయితే మరొకరు రథ సారథి మాత్రం అమిత్ షానే. పార్టీ చీఫ్ గా బీజేపీని సక్సెస్ మార్గంలో నడిపించడంలో విజయం సాధించాడు.
ఆ తర్వాత తన గ్రాఫ్ అంచెలంచెలుగా ఎదిగి పోయింది. ప్రస్తుతం కేంద్ర హోం , సహకార శాఖ మంత్రిగా తనదైన శైలిలో దూసుకు పోతున్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Modi) తర్వాత ఎవరు అంటే బీజేపీలోనే కాదు ఇతర ప్రతిపక్షాలలో చెప్పే ఒకే ఒక్క పేరు అమిత్ చంద్ర షా. అక్టోబర్ 22 షా పుట్టిన రోజు. ఈ ట్రబుల్ షూటర్ ..టార్చ్ బేరర్ మరిన్ని పుట్టిన రోజులు జరుపుకోవాలని కోరుకుందాం.
Also Read : ట్రబుల్ షూటర్ కు శుభాకాంక్షల వెల్లువ