ICC T20 Rankings : ఐసీసీ టాప్ 10లో విరాట్ సూర్య‌..కోహ్లీ

నెంబ‌ర్ వ‌న్ గా పాక్ క్రికెట‌ర్ రిజ్వాన్

ICC T20 Rankings : ఆస్ట్రేలియా వేదిక‌గా జ‌రుగుతున్న ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో పాకిస్తాన్ తో అద్భుత‌మైన ఆట తీరుతో మ‌రోసారి ఆక‌ట్టుకున్న భార‌త జ‌ట్టు స్టార్ క్రికెట‌ర్ ర‌న్ మెషీన్ విరాట్ కోహ్లీ ఎట్ట‌కేల‌కు త‌న ర్యాంకు మెరుగు ప‌ర్చుకున్నాడు. తాజాగా ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) వ‌ర‌ల్డ్ ర్యాంకింగ్స్ ను(ICC T20 Rankings) ప్ర‌క‌టించింది.

ఎప్ప‌టి లాగే త‌న స్థానాన్ని ప‌దిల ప‌ర్చుకున్నాడు పాకిస్తాన్ క్రికెట‌ర్ , ఓపెన‌ర్ మ‌హ్మ‌ద్ రిజ్వాన్. ఇక పాకిస్తాన్ పై అద్బుత‌మైన ఇన్నింగ్స్ తో స‌త్తా చాటిన కోహ్లీ టాప్ -10 లోకి దూసుకు వ‌చ్చాడు. యూఏఈ వేదిక‌గా ఈ ఏడాది జ‌రిగిన ఆసియా క‌ప్ -22లో టాప్ స్కోర‌ర్ గా నిలిచాడు కోహ్లీ.

ఆఫ్గ‌నిస్తాన్ పై సెంచ‌రీతో త‌న‌దైన మార్క్ చూపించాడు. అప్పుడు ప్ర‌క‌టించిన జాబితాలో కోహ్లీకి 35వ ప్లేస్ . ప్ర‌స్తుతం ఏకంగా 10లోకి చేరడం విశేషం. ఇంకా టోర్నీ ఉండ‌డం, ప‌లు మ్యాచ్ లు జ‌ర‌గ‌నుండ‌డంతో కోహ్లీ గ‌నుక ఇదే ఫామ్ కొన‌సాగిస్తూ పోతే టాప్ లోకి చేర‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.

ప్ర‌స్తుతం విడుద‌ల చేసిన జాబితాలో 9వ స్థానంలో చేరాడు. ఇక రిజ్వాన్ 849 పాయింట్లతో నెంబ‌ర్ వ‌న్ గా నిలిచాడు. ఆ త‌ర్వాతి స్థానంలో న్యూజిలాండ్ బ్యాట‌ర్ డివాన్ కాన్వే 831 పాయింట్ల‌తో ద‌క్కించుకున్నాడు. సూర్య కుమార్ యాద‌వ్ మూడో స్థానంలో ఉండ‌గా త‌ర్వాతి స్థానాల్లో బాబ‌ర్ ఆజ‌మ్ , మార్క‌ర‌మ్ , డేవిడ్ మ‌లాన్ , ఆరోన్ ఫించ్ , నిస్సంకా నిలిచారు.

మ‌రో వైపు కాన్వే..సూర్య మ‌ధ్య కొద్ది పాటి పాయింట్ల తేడా మాత్రం ఉంది. ఒక వేళ సూర్య దంచి కొడితే నెంబ‌ర్ వ‌న్ పొజిష‌న్ చేరుకునే ఛాన్స్ ఉంది.

Also Read : ప‌సికూన‌పై ప్ర‌తాపం చూపిస్తారా

Leave A Reply

Your Email Id will not be published!