ICC T20 Rankings : ఐసీసీ టి20 ర్యాంకుల్లో సూర్య భాయ్ టాప్

రెండో స్థానంతో స‌రి పెట్టుకున్న రిజ్వాన్

ICC T20 Rankings : భార‌త స్టార్ సూర్య కుమార్ యాద‌వ్ చ‌రిత్ర సృష్టించాడు. ఆస్ట్రేలియా వేదిక‌గా జ‌రుగుతున్న ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో దుమ్ము రేపుతున్నాడు. తాజాగా ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్ కౌన్సిల్ టి20 ర్యాంకుల‌ను(ICC T20 Rankings) ప్ర‌క‌టించింది. గ‌తంలో రెండవ స్థానంలో ఉన్న సూర్య భాయ్ ఇప్పుడు పాకిస్తాన్ స్టార్ క్రికెట‌ర్, ఓపెన‌ర్ మ‌హ్మ‌ద్ రిజ్వాన్ నెంబర్ వ‌న్ ప్లేస్ ను ఆక్ర‌మించాడు.

అత‌డిని రెండో ప్లేస్ కు నెట్టేశాడు. ఎలాంటి బౌల‌ర్ నైనా బాద‌డ‌మే ప‌నిగా పెట్టుకున్నాడు సూర్య కుమార్ యాద‌వ్. రిజ్వాన్ కు 842 పాయింట్ల‌తో రెండో స్థానంలో నిలిచాడు. ఇక సూర్య భాయ్ 863 పాయింట్లో అగ్ర స్థానంలో నిలిచాడు. ఇదిలా ఉండ‌గా సూర్య కుమార్ , రిజ్వాన్ మ‌ధ్య 21 పాయింట్లు ఎక్కువ‌గా రావ‌డం విశేషం.

సూర్య కుమార్ యాద‌వ్ 2021 మార్చి 14న ఇంగ్లండ్ తో త‌న కెరీర్ స్టార్ట్ చేశాడు. ఈ ఏడాది ప్రారంభంలో సూర్య భాయ్ టి20లో సెంచ‌రీ చేశాడు. మ‌రో వైపు పాకిస్తాన్ తో జ‌రిగిన మ్యాచ్ లో 16 ప‌రుగులు చేస్తే నెద‌ర్లాండ్స్ , ద‌క్షిణాఫ్రికా జ‌ట్ల‌తో జ‌రిగిన మ్యాచ్ లో హాఫ్ సెంచ‌రీతో స‌త్తా చాటుకున్నాడు.

ఇప్ప‌టి వ‌ర‌కు సూర్య భాయ్ టి20ల‌లో 35 మ్యాచ్ లు ఆడాడు. మొత్తం 1,179 ర‌న్స్ చేయ‌డం విశేషం. ఇందులో 11 హాఫ్ సెంచ‌రీలు ఉన్నాయి. ఇక టి20 బౌలింగ్ విభాగానికి సంబంధించి ర్యాంకింగ్స్ లో ఆఫ్గాన్ బౌల‌ర్ ర‌షీద్ ఖాన్ టాప్ లో నిలిచాడు. ఆల్ రౌండ‌ర్ల ర్యాంకింగ్స్ లో బంగ్లాదేశ్ ఆల్ రౌండ‌ర్ ష‌కీబ్ అల్ హ‌స‌న్ నెంబ‌ర్ 1గా ఉండ‌డం విశేషం.

Also Read : కేఎల్ రాహుల్ పుంజుకోవ‌డం ఖాయం

Leave A Reply

Your Email Id will not be published!