Samantha Raj DK : ఆ దర్శకుడి మాటలే నాకు ఓదార్పు
నటి సమంత షాకింగ్ కామెంట్స్
Samantha Raj DK : సినీ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేకత కలిగిన నటిగా గుర్తింపు పొందింది నటి సమంత. ఏం మాయ చేశావే సినిమాతో ఒక్కసారిగా మోస్ట్ పాపులర్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. గౌతం వాసుదేవ మీనన్ దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా ఓ ప్రేమ కావ్యమని చెప్పక తప్పదు.
తన సినీ కెరీర్ ను ఒక మలుపు తిప్పింది. ఇదే సమయంలో ఆ మూవీలో తోడుగా నటించిన అక్కినేని నాగార్జున తనయుడు అక్కినేని నాగ చైతన్య లవ్ లో పడింది. ఆ తర్వాత ప్రేమ నుంచి పరిణయం దాకా వెళ్లింది.
ఆ తర్వాత కొంత కాలం పాటు బాగానే ఉన్నారు. కానీ ఏమైందో ఏమో కానీ విడి పోతున్నట్లు ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. దాని వెనుక గల కారణాలు ఇప్పటికీ తెలియ రాలేదు.
ఆ తర్వాత పలు సినిమాల్లో నటించింది సమంత. ఇటీవల సుకుమార్ అల్లు అర్జున్ తో కలిసి తీసిన పుష్ప మూవీ దుమ్ము రేపింది. ఇందులో సమంత ఐటం సాంగ్ చేసింది. ఊ అంటా ఊఊ అంటావా అన్న పాట ప్రపంచాన్ని ఒక ఊపు ఊపింది.
ఈ పాటకు సమంత చేసిన డ్యాన్స్ కుర్ర కారునే కాదు వయస్సు మళ్లిన వారిని కూడా మనసు జివ్వుమనేలా అనిపించింది. ఆ తర్వాత సమంత పేరు దేశ
వ్యాప్తంగా మారు మ్రోగింది. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ లో ఇప్పుడు సమంత హాట్ టాపిక్ గా మారింది.
ఈ తరుణంలో సమంతకు మయోసిటీస్ అనే అరుదైన వ్యాధితో బాధ పడుతున్నట్లు తానే స్వయంగా ప్రకటించింది. దీంతో ఆమె ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు.
ఈ కష్ట కాలంలో తనకు ఓదార్పు ఇచ్చింది మాత్రం దర్శకుడు రాజ్ అని పేర్కొంది(Samantha Raj DK). ఇదే విషయాన్ని ఆమె ట్విట్టర్ వేదికగా తెలియ చేసింది.
తాజాగా ఆమె నటించిన యశోద మూవీ రిలీజ్ కానుంది. ఇక ఆ ఆ దర్శకుడు ఎవరో కాదు ఫామిలీ మ్యాన్ వెబ్ సీరీస్ దర్శకుడు అన్నమాట.
Also Read : మస్క్ ట్విట్టర్ ను వదిలేస్తే బెటర్ – రుఫెలో