PAK vs NZ T20 World Cup : పాక్ గెలుస్తుందా కీవీస్ నిలుస్తుందా

సెమీ ఫైన‌ల్ మ్యాచ్ లో పాగా వేస్తారా

PAK vs NZ T20 World Cup : ఆస్ట్రేలియా వేదిక‌గా జ‌రుగుతున్న ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) టి20 వ‌ర‌ల్డ్ -2022 ఆఖ‌రి అంకానికి చేరుకుంది. సెమీ ఫైన‌ల్ కు నాలుగు జ‌ట్లు చేరుకున్నాయి. గ్రూప్ -1 లో న్యూజిలాండ్ , ఇంగ్లండ్ ఉండ‌గా గ్రూప్ -2లో ఇండియా, పాకిస్తాన్ మ‌ధ్య జ‌ర‌గ‌నుంది.

న‌వంబ‌ర్ 9న మొద‌టి సెమీ ఫైన‌ల్ మ్యాచ్ పాకిస్తాన్ , న్యూజిలాండ్(PAK vs NZ T20 World Cup)  మ‌ధ్య కీల‌క మ్యాచ్ కొన‌సాగ‌నుంది. ఇరు జ‌ట్ల మ‌ధ్య నువ్వా నేనా అన్న రీతిలో జ‌రిగేందుకు అవ‌కాశం ఉంది. ఇప్ప‌టికే అద్భుత‌మైన ఆట తీరుతో ఆక‌ట్టుకుంది న్యూజిలాండ్. ఇక పాకిస్తాన్ అనుకోని స‌మ‌యంలో అదృష్టం క‌లిసి వ‌చ్చి పాకిస్తాన్ సెమీస్ కు చేరుకుంది.

ఇరు జ‌ట్ల ప‌రంగా చూస్తే బౌలింగ్ లో పాకిస్తాన్ బ‌లంగా ఉండ‌గా న్యూజిలాండ్ బ్యాటింగ్ లో దుమ్ము రేపుతోంది. దీంతో ఈ కీల‌క మ్యాచ్ బౌలింగ్ వ‌ర్సెస్ బ్యాటింగ్ మ‌ధ్య పోరు కొన‌సాగ‌నుంది. ఆఖ‌రి నిమిషంలో మెగా టోర్నీలో ఎంట్రీ ఇచ్చిన పాకిస్తాన్ ఎలాగైనా స‌రే స‌త్తా చాటాల‌ని, కీవీస్ కు షాక్ ఇవ్వాల‌ని డిసైడ్ అయ్యింది.

అలెన్, కాన్వే తో పాటు కీవీస్ కెప్టెన్ విలియ‌మ్సన్ ఫామ్ లో ఉండ‌డం ఆ జ‌ట్టుకు ప్ల‌స్ . ఇక బౌలింగ్ లో బౌల్ట్ , సోధీ కీల‌కం కానున్నారు. మ‌రో వైపు పాకిస్తాన్ జ‌ట్టులో బాబ‌ర్ ఆజ‌మ్, రిజ్వాన్ , షాన్ మ‌సూద్, ఇఫ్తికార్ , న‌వాజ్ కీల‌క పాత్ర పోషిస్తే జ‌ట్టుకు విజ‌యం ఖాయం. ఇక బౌలింగ్ లో ఆఫ్రిది, న‌సీమ్ సా, వ‌సీం స‌త్తా చాటేందుకు రెడీ అయ్యారు.

Also Read : విరిగిన హృద‌యాలు ఎక్క‌డికి వెళ్తాయి

Leave A Reply

Your Email Id will not be published!