TMC Invites Vir Das : వీర్ దాస్ కామెడీ ‘షో’కు టీఎంసీ ఆహ్వానం

బెంగ‌ళూరులో హాస్య న‌టుడి షో ర‌ద్దు

TMC Invites Vir Das : హిందూ సంస్థ‌లు అభ్యంత‌రం వ్య‌క్తం చేయ‌డంతో పాటు పోలీస్ స్టేష‌న్ లో ఫిర్యాదు చేయ‌డంతో న‌వంబ‌ర్ 10న బెంగ‌ళూరులో జ‌ర‌గాల్సిన హాస్య న‌టుడు వీర్ దాస్ స్టాండ‌ప్ షో ర‌ద్ద‌యింది. ఈ విష‌యాన్ని స‌ద‌రు క‌మెడియ‌న్ త‌న సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌క‌టించాడు.

త‌న షో ర‌ద్దు కార‌ణంగా ఇబ్బంది ప‌డిన ప్ర‌తి ఒక్క‌రికి పేరు పేరునా క్ష‌మించ‌మ‌ని కోరుతున్న‌ట్లు తెలిపాడు. ఇప్ప‌టికే రెండో క‌మెడియ‌న్ వీర్ దాస్ ఇలా షో ర‌ద్దు కావ‌డం క‌ర్ణాట‌క‌లో. హిందూ సంస్థ‌లు ప‌నిగ‌ట్టుకుని వీర్ దాస్ ను షో చేయ‌కుండా అడ్డుకున్నాయంటూ క‌ళాకారులు ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

ఈ దేశంలో హిందూ మ‌తం పేరుతో ఉన్మాదం చోటు చేసుకుందంటూ ఆరోపించారు. ఇదే క్ర‌మంలో వీర్ దాస్ కు త‌న షోను నిర్వ‌హించేందుకు తాము స‌హ‌కారం చేస్తామ‌ని ప్ర‌క‌టించింది తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీ(TMC Invites Vir Das). ఈ మేర‌కు టీఎంసీకి చెందిన ఎంపీ డెరిక్ ఒబ్రెయిన్ వీర్ దాస్ కు ఆహ్వానం ప‌లికారు.

తాము పూర్తి భ‌ద్ర‌త‌తో షో చేప‌ట్టేందుకు అన్ని విధాలుగా స‌పోర్ట్ గా నిలుస్తామ‌న్నారు. ఇదే విష‌యాన్ని ఎంపీ ట్విట్ట‌ర్ ద్వారా పేర్కొన్నారు. ఇదే స‌మ‌యంలో తాను భార‌తీయుడిన‌ని, ఎవ‌రి మ‌నోభావాల‌ను దెబ్బ తీయ‌డం లేదంటూ స్ప‌ష్టం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోను కూడా అప్ లోడ్ చేశాడు వీర్ దాస్.

తాను ఎవ‌రి ప‌ట్ల వ్య‌తిరేక‌త క‌న‌బ‌ర్చ‌డం కాని ఉండ‌ద‌న్నాడు. కానీ షోను ర‌ద్దు చేయ‌డం వ‌ల్ల ప్రేక్ష‌కులు ఇబ్బందుల‌కు గురవుతార‌ని వాపోయ‌డు స్టాండ‌ప్ క‌మెడియన్. ఇదిలా ఉండ‌గా ఎంపీ డెరిక్ ఓబ్రెయిన్ చేసిన ట్వీట్ ఇప్పుడు క‌ల‌క‌లం రేపుతోంది.

Also Read : దీపికా త‌ర‌గ‌ని అందం నీది – బాద్ షా

Leave A Reply

Your Email Id will not be published!