Shah Rukh Khan Deepika : దీపికా త‌ర‌గ‌ని అందం నీది – బాద్ షా

బాలీవుడ్ లో ప‌దుకొనే జ‌ర్నీకి 15 ఏళ్లు

Shah Rukh Khan Deepika : ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టుడు బాద్ షా షారుఖ్ ఖాన్(Shah Rukh Khan) ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. త‌న కో స్టార్ ప్ర‌ముఖ న‌టి దీపికా ప‌దుకొనే ను , ఆమెతో తాను న‌టించిన సినిమాల గురించి కూడా గుర్తు చేసుకున్నాడు. సోష‌ల్ మీడియా వేదిక‌గా అద్భుత‌మైన ఫోటోల‌ను పంచుకున్నాడు.

ఎందుకంటే బాలీవుడ్ న‌టి దీపికా ప‌దుకొనే బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి 15 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సంద‌ర్భంగా సినీ రంగానికి చెందిన ప్ర‌ముఖులు దీపికా ప‌దుకొనేకు అభినంద‌న‌లు తెలియ చేశారు. దీపికా ప‌దుకొనే(Deepika Padukone) న‌వ్వుతో పాటు స‌హ‌జ సిద్ద‌మైన న‌ట‌న త‌న‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుందని పేర్కొన్నాడు షారుఖ్ ఖాన్.

సినీ జ‌ర్నీలో ఇన్నేళ్లు కొన‌సాగుతూ వ‌స్తున్నందుకు, నీదైన ముద్ర క‌న‌బ‌రుస్తూ సినిమాల‌లో న‌టిస్తూ ప్ర‌త్యేక‌త‌ను చాటు కోవ‌డం సూప‌ర్ అని కొనియాడారు. తాను కూడా ఎంతో మంది కో స్టార్స్ తో న‌టించాన‌ని , ఒక్కొక్క‌రితో ఒక్కో అనుభ‌వం ఉంటుంద‌న్నాడు.

తాను దీపికా ప‌దుకొనే క‌లిసి న‌టించిన చెన్నై ఎక్స్ ప్రెస్ మూవీ త‌న‌కు ఇప్ప‌టికీ గుర్తుండి పోతుంద‌ని తెలిపాడు షారుఖ్ ఖాన్. ప‌దిహేన‌ళ్ల పాటు అద్భుత‌మైన సంవ‌త్స‌రాలు కొన‌సాగాయంటూ దీపికాను ప్రేమ‌తో ముంచెత్తాడు బాద్ షా(Shah Rukh Khan). ఓం శాంతి మూవీ ని ఇప్ప‌టికీ మ‌రిచి పోలేక పోతున్నాన‌ని గుర్తు చేసుకున్నాడు అగ్ర న‌టుడు.

విచిత్రం ఏమిటంటే షారుక్ ఖాన్ షేర్ చేసిన ఫోటోలు అన్నింట్లోనూ దీపికా ప‌దుకొనే క‌ళ్ల‌ల్లోకి చూస్తూ ఉన్న ఫోటోల‌ను పోస్ట్ చేయ‌డం విశేషం. ఈ ఫోటోలు వైర‌ల్ గా మారాయి సోష‌ల్ మీడియాలో.

Also Read : వీర్ దాస్ కామెడీ ‘షో’కు టీఎంసీ ఆహ్వానం

Leave A Reply

Your Email Id will not be published!