Ayesha Omar Shoaib : అయేషాతో రొమాన్స్ సానియాకు నో ఛాన్స్
కొంపలో కుంపటికి ఆ ముద్దుగుమ్మే కారణమా
Ayesha Omar Shoaib : పాకిస్తాన్ లోనే కాదు యావత్ భారతంలో కూడా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారి పోయింది హైదరాబాద్ కు చెందిన ప్రముఖ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా. పాకిస్తాన్ కు చెందిన క్రికెటర్ షోయబ్ మాలిక్ తో అంగరంగ వైభవంగా పెళ్లి జరిగింది. ఈ ఇద్దరూ కొన్నాళ్ల పాటు సజావుగా కాపురం చేశారు.
ప్రపంచాన్ని చుట్టి వచ్చారు. చెట్టా పట్టాల్ వేసుకున్నారు. వీరికి ఓ ముద్దుల కొడుకు కూడా ఉన్నాడు. కరోనా కష్ట కాలంలో సానియా మీర్జా తీవ్ర ఇబ్బందులు పడింది. ఆమె కొడుక్కి దూరంగా ఉండడాన్ని తట్టుకోలేక పోయింది. ఇదే విషయాన్ని ట్విట్టర్ వేదికగా ప్రస్తావించి వాపోయింది.
తాను ఎక్కడికి వెళ్లినా కొడుకుతో వెళ్లేది. కాగా కొంత కాలం నుంచి మాలిక్, సానియా మీర్జా మధ్య పొరపొచ్చాలు వచ్చాయని వారిద్దరూ వేర్వేరుగా ఉంటున్నారని ప్రచారం జరుగుతోంది. ఇద్దరూ లాయర్లను సంప్రదించినట్లు పాకిస్తాన్ మీడియా కథనాలు ప్రచురిస్తోంది. ఇందుకు తగ్గట్టు మరో వార్త గుప్పుమంది.
అదేమిటంటే పాకిస్తాన్ కు చెందిన నటి అయేషా ఒమర్ తో షోయబ్ మాలిక్(Ayesha Omar Shoaib) పీకల లోతు రొమాన్స్ లో మునిగి పోయినట్లు టాక్. అందుకే సానియాకు దూరంగా ఉంటూ వస్తున్నాడని, చివరకు ఇదే వారిద్దరి మధ్య విడి పోయేందుకు ప్రధాన కారణమని ప్రచారం జరుగుతోంది. అయేషా ఓమర్ , షోయబ్ మాలిక్ ఇద్దరూ బోల్డ్ షూట్ లో పాల్గొన్నారు.
అప్పుడే ఇద్దరి మధ్య ఇంటిమసీ పెరిగిందని, అది ప్రేమగా చివరకు రొమాన్స్ వరకు తీసుకు వెళ్లినట్లు టాక్.
Also Read : ముంబై ఎయిర్ పోర్ట్ లో షారుక్ నిలిపివేత