Chiranjeevi Krishna : సూప‌ర్ స్టార్ మ‌ర‌ణం మెగాస్టార్ భావోద్వేగం

హిమోన్న‌త శిఖ‌ర‌మంత గొప్ప న‌టుడు

Chiranjeevi Krishna : సూప‌ర్ స్టార్ కృష్ణ ఇక లేర‌న్న వాస్త‌వాన్ని జీర్ణించు కోలేక పోతున్నాన‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు మెగాస్టార్ చిరంజీవి. న‌టుడిగా, ద‌ర్శ‌కుడిగా, నిర్మాత‌గా, రాజ‌కీయ నాయ‌కుడిగా ప్ర‌తి రంగంలోనూ త‌న‌దైన ముద్ర వేశార‌ని కొనియాడారు. తెలుగు సినిమా రంగానికి తీర‌ని లోటు అని పేర్కొన్నారు చిరంజీవి.

తాను త‌ట్టుకోలేక పోతున్నాన‌ని వాపోయారు. సామాన్యుడిగా వ‌చ్చి శ‌క్తిగా ఎదిగార‌ని పేర్కొన్నారు. ఆయ‌న మంచి మ‌న‌సు క‌లిగిన గొప్ప వ్య‌క్తి అని, సాహ‌సానికి ప్ర‌తీక‌, ధైర్యానికి ప‌ర్యాయ ప‌దం , ధైర్యానికి, ప‌ట్టుద‌ల‌కు, మాన‌వ‌త్వానికి, మంచిత‌నానికి మ‌రో పేరు సూప‌ర్ స్టార్ కృష్ణ(Chiranjeevi Krishna) అని ప్ర‌శంసించారు మెగాస్టార్ చిరంజీవి.

కృష్ణ లాంటి నటుడు భార‌తీయ సినీ రంగంలో అరుదుగా పుడ‌తార‌ని అన్నారు. తెలుగు సినిమా రంగంలో విభిన్న ప్ర‌క్రియ‌ల‌కు శ్రీ‌కారం చుట్టిన ఘ‌న‌త కూడా ఆయ‌న‌దేన‌ని కొనియాడారు చిరంజీవి. మంచి మ‌న‌సు క‌లిగిన ఆయ‌న ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని కోరుతున్నాన‌ని తెలిపారు.

కుటుంబీకుల‌కు ప్ర‌ధానంగా నా సోద‌రుడు మ‌హేష్ బాబు కు ప్ర‌గాఢ సానుభూతిని తెలియ చేస్తున్న‌ట్లు పేర్కొన్నారు. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ తీవ్ర సంతాపం వ్య‌క్తం చేశారు. సినిమా రంగాన్ని కాంక్షించే వ్య‌క్తిని కోల్పోవ‌డం బాధాక‌ర‌మ‌న్నారు.

తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌కు ఆయ‌న చేసిన సేవ‌లు ప్రశంస‌నీయ‌మ‌ని పేర్కొన్నారు. ర‌మేశ్ బాబు, ఇందిరా దేవితో పాటు ప్ర‌స్తుతం కృష్ణ గారిని కోల్పోవ‌డం త‌న‌ను బాధ‌కు గురి చేసింద‌న్నారు ప‌వ‌ర్ స్టార్.

Also Read : స్నేహ‌పాత్రుడు అభిమాన‌ధ‌నుడు

Leave A Reply

Your Email Id will not be published!