PM Modi Krishna : కృష్ణ లెజెండరీ సూప‌ర్ స్టార్ – మోదీ

సినీ, వినోద రంగానికి తీర‌ని లోటు

PM Modi Krishna : తెలుగు సినీ రంగానికి చెందిన దిగ్గ‌జ న‌టుడు సూప‌ర్ స్టార్ కృష్ణ మృతికి తీవ్ర సంతాపం వ్య‌క్తం చేశారు దేశ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ. మంగ‌ళ‌వారం ఉద‌యం హైద‌రాబాద్ లోని కాంటినెంట‌ల్ ఆస్ప‌త్రిలో తెల్ల వారుజామున క‌న్ను మూశారు. న‌టుడిగా, ద‌ర్శ‌కుడిగా, నిర్మాత‌గా, రాజ‌కీయ నాయ‌కుడిగా కృష్ణ ఎన‌లేని సేవ‌లు చేశార‌ని కొనియాడారు.

ట్విట్ట‌ర్ వేదిక‌గా ప్ర‌ధాన‌మంత్రి స్పందించారు. ఇవాళ కృష్ణ మ‌ర‌ణించార‌ని తెలియ‌గానే తాను దిగ్భ్రాంతికి గురైన‌ట్లు పేర్కొన్నారు. తెలుగు సినీ రంగానికే కాదు యావ‌త్ భార‌త సినీ రంగానికి తీర‌ని లోటు అని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. కృష్ణ మామూలు వ్య‌క్తి కాదు. ఆయ‌న క‌ష్ట‌ప‌డి పైకి వ‌చ్చారు.

త‌న‌తో పాటు వేలాది మందికి ఉపాధి క‌ల్పించారు. ఎంద‌రికో ఆద‌ర్శ ప్రాయంగా నిలిచార‌ని ప్ర‌శంసించారు మోదీ. సూప‌ర్ స్టార్ కృష్ణ త‌న బ‌హుముఖ న‌ట‌న‌, స‌జీవ వ్య‌క్తిత్వం ద్వారా ప్ర‌జ‌ల హృద‌యాల‌ను గెలుచుకున్నారంటూ ప్ర‌శంసించారు ప్ర‌ధాన మంత్రి(PM Modi Krishna). ఆయ‌న మృతితో తాను షాక్ కు లోనైన‌ట్లు తెలిపారు.

ఈ విషాద స‌మ‌యంలో నా ఆలోచ‌న‌లు మ‌హేష్ బాబు, ఆయ‌న కుటుంబంతో ఉన్నాయ‌ని పేర్కొన్నారు. అల్లూరి సీతారామ‌రాజు చిత్రం ద్వారా ఎంతో ఆద‌ర‌ణ చూరగొన్నార‌ని కితాబు ఇచ్చారు. సూప‌ర్ స్టార్ కృష్ణ ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని ప్రార్థిస్తున్నాన‌ని అన్నారు న‌రేంద్ర మోదీ.

ఇదిలా ఉండ‌గా త‌మిళ‌నాడు సీఎం ఎంకే స్టాలిన్ తీవ్ర సంతాపం వ్య‌క్తం చేశారు. మ‌హేష్ బాబు కుటుంబానికి ఆ భ‌గ‌వంతుడి ఆశీస్సులు ఉండాల‌ని కోరారు.

Also Read : మ‌న్నెం వీరుడి చిత్రం మ‌రిచి పోలేం

Leave A Reply

Your Email Id will not be published!