R Narayana Murthy : మ‌న‌సున్న మారాజు కృష్ణ – పీపుల్స్ స్టార్

ఆయ‌న నిర్మాత‌ల పాలిట దేవుడు

R Narayana Murthy : సూప‌ర్ స్టార్ కృష్ణ మ‌ర‌ణంతో తెలుగు సినిమా రంగం గొప్ప న‌టుడిని కోల్పోయింద‌న్నారు ప్ర‌ముఖ న‌టుడు, ద‌ర్శ‌కుడు, నిర్మాత ఆర్. నారాయ‌ణ‌మూర్తి. న‌టుడిగా, ద‌ర్శ‌కుడిగా, నిర్మాత‌గా, రాజ‌కీయ నాయ‌కుడిగా ఆయ‌న త‌న‌దైన ముద్ర వేశార‌ని ప్ర‌శంసించారు. కృష్ణ మ‌న‌సున్న మారాజు అని కొనియాడారు.

ఎంతో మంది నిర్మాత‌ల‌ను నిల‌బెట్టిన గొప్ప వ్య‌క్తి అని పేర్కొన్నారు. కృష్ణ పార్థీవ దేహానికి ఆర్. నిరాయ‌ణ‌మూర్తి(R Narayana Murthy) నివాళులు అర్పించారు. సినీ రంగంలో ఎవ‌రూ ఎక్కువ కాదు. ఎవ‌రూ త‌క్కువ కాదు అని ఆత్మ గౌర‌వాన్ని నిల‌బెట్టిన మ‌హ‌నీయుడు అని వాపోయారు ద‌ర్శ‌కుడు. సినీ రంగంలో ఎంద‌రో మ‌హానుభావులు ఉన్నారు.

నాలాంటి వాళ్ల‌కు , పేద‌ల‌కు, బ‌లహీన వ‌ర్గాల‌కు ఆస‌రా క‌ల్పించిన గొప్ప వారిలో కృష్ణ కూడా ఒక‌రని క‌న్నీటి ప‌ర్యంతం అయ్యారు. నిర్మాత‌ల్లో డి. రామానాయుడు, ద‌ర్శ‌కులలో దాస‌రి నారాయ‌ణ రావు, ర‌చ‌యిత‌ల్లో ప‌రుచూరి సోద‌రులు, హీరోల్లో న‌ట‌శేఖ‌రుడు కూడా ఎల్ల‌ప్ప‌టికీ నిలిచే ఉంటార‌ని స్ప‌ష్టం చేశారు ఆర్. నారాయ‌ణ మూర్తి.

ఆయ‌న గురించి ఎంత చెప్పినా త‌క్కువేన‌ని అన్నారు. ఆయ‌న మ‌న‌సు స్వ‌చ్ఛ‌మైన బంగారం. ఎంతో మందిని నిల‌బెట్ట‌ని ఘ‌న‌త కూడా కృష్ణ అని తెలిపారు. సినిమా ఫెయిల్ అయితే నిర్మాత‌ల‌ను పిలిచి వాళ్ల‌కు డేట్స్ ఇచ్చిన చ‌రిత్ర ఒక్క సూప‌ర్ స్టార్ కు మాత్రమే ఉంద‌న్నారు.

అల్లూరి సీతారామ‌రాజు ఎప్ప‌టికీ నిలిచే ఉంటుంద‌న్నారు. ఆయ‌న న‌ట‌న అపూర్వం అద్భుత‌మ‌న్నారు. ఆనాడు మాజీ సీఎం , దివంగ‌త ఎన్టీఆర్ సైతం ఈ సినిమాను కొనియాడార‌ని ఈ సంద‌ర్భంగా గుర్తు చేశారు.

Also Read : సినీ దిగ్గ‌జానికి సంతాపాల వెల్లువ

Leave A Reply

Your Email Id will not be published!