Chandra Babu Naidu : అరుదైన న‌టుడు సూప‌ర్ స్టార్ కృష్ణ

టీడీపీ చీఫ్ చంద్ర‌బాబు నాయుడు

Chandra Babu Naidu : సూప‌ర్ స్టార్ కృష్ణ మ‌ర‌ణం తెలుగు సినీ రంగానికి తీర‌ని లోటు అని పేర్కొన్నారు టీడీపీ చీఫ్ నారా చంద్ర‌బాబు నాయుడు. కృష్ణ పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. మంగ‌ళవారం మీడియాతో మాట్లాడారు టీడీపీ చీఫ్‌. తాను చ‌దువుకునే స‌మ‌యంలో కృష్ణ న‌టించిన తేనె మ‌న‌సులు మూవీని చూశాన‌ని చెప్పారు.

మ‌న్యం వీరుడు అల్లూరి సీతారామ రాజు తీసిన చిత్రం ఎంతో ప్ర‌భావం చూపింద‌న్నారు. ఇప్ప‌టికీ ఆ చిత్రం తాను మ‌రిచి పోలేక పోతున్నాన‌ని పేర్కొన్నారు చంద్ర‌బాబు నాయుడు(Chandra Babu Naidu). న‌టుడిగా, ద‌ర్శ‌కుడిగా, నిర్మాత‌గా త‌న‌దైన ముద్ర క‌న‌బ‌ర్చార‌ని కొనియాడారు. రాజ‌కీయంగా ప్ర‌భావితం చూపార‌ని తెలిపారు.

సినీ రంగానికి ఆయ‌న చేసిన సేవ‌లు ప్ర‌శంస‌నీయ‌మ‌ని పేర్కొన్నారు చంద్ర‌బాబు నాయుడు. ఇలాంటి న‌టులు అరుదుగా జ‌న్మిస్తార‌ని అన్నారు. తెలుగు సినిమా రంగం అంటేనే నంద‌మూరి తార‌క రామ‌రావు, అక్కినేని నాగేశ్వ‌ర్ రావు, శోభ‌న్ బాబు, కృష్ణం రాజు దిగ్గ‌జ న‌టులు వెళ్లి పోయార‌ని వారి స‌ర‌స‌న ఇప్పుడు ఇక సెల‌వంటూ సూప‌ర్ స్టార్ కృష్ణ వెళ్లి పోవ‌డం త‌న‌ను బాధ‌కు గురి చేసింద‌న్నారు.

ఆయ‌న ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని ఆ భ‌గ‌వంతుడిని ప్రార్థిస్తున్న‌ట్లు తెలిపారు. అంత‌కు ముందు మ‌హేష్ బాబు, న‌మ్ర‌త‌ల‌ను ప‌రామ‌ర్శించారు. త‌న‌కు న‌టుడి కృష్ణ‌తో ఉన్న అనుబంధాన్ని ఈ సంద‌ర్భంగా గుర్తు చేసుకున్నారు.

ఇదిలా ఉండ‌గా కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీతో పాటు దేశ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ తీవ్ర సంతాపం వ్య‌క్తం చేశారు.

Also Read : మ‌న‌సున్న మారాజు కృష్ణ – పీపుల్స్ స్టార్

Leave A Reply

Your Email Id will not be published!