Pakistan PM Wives : ఈ పీఎం పెళ్లిళ్ల రాయుడు
చర్చకు దారితీసిన వ్యక్తిగత జీవితం
Pakistan PM Wives : ఆయన పాకిస్తాన్ కు ప్రధానమంత్రిగా ఉన్నారు. పంజాబ్ సీఎంగా ఎక్కువ కాలం సీఎంగా పని చేసిన చరిత్ర ఉంది. ఇక ఇమ్రాన్ ఖాన్ ను అవిశ్వాస తీర్మానం ద్వారా ఓడించి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన షెహబాజ్ షరీఫ్ వ్యక్తిగత జీవితం మాత్రం చర్చకు దారితీసింది.
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆయన పెళ్లిళ్ల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటి వరకు ఆయన ఐదుగురిని వివాహం చేసుకున్నారు. ప్రధానిగా కొలువు తీరాక పీఎం ఎవరిని పెళ్లి చేసుకున్నారనే దానిపై చర్చ జరుగుతోంది. ఇక మాజీ పాకిస్తాన్ క్రికెట్ కెప్టెన్ , మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ ముగ్గురితో సరి పెట్టుకుంటే షెహబాజ్ షరీఫ్ మాత్రం ఆయన కంటే రెండు ఆకులు ఎక్కువ చదివాడు.
పాక్ మీడియా ప్రకారం షెహబాజ్ కు(Pakistan PM Wives) ప్రస్తుతం ఇద్దరు భార్యలు ఉన్నారు. బేగం నుస్రత్ షాబాజ్ , ఆలియా హనీ, నోలీఫర్ ఖోసా , తెహ్మీనా దురానీ , కుల్సూమ్ హై. ప్రస్తుతం నుస్రత్ , తెహ్మీనా దురానీలు ప్రస్తుతం షరీఫ్ కు ఇద్దరు భార్యలుగా చెలామణి అవుతున్నారు.
మిగిలిన ముగ్గురు మాత్రం విడాకులు ఇచ్చినట్లు సమాచారం. వీరిలో బేగం నుస్రత్ షాబాజ్ షెహబాజ్ మొదటి భార్య. 1973లో పెళ్లి చేసుకున్నాడు. నలుగురు పిల్లలు ఉన్నారు. సల్మాన్ , హంజా, జవేరియా, రబియా. రెండో భార్య ఆలియా హనీ. 1993లో రెండో పెళ్లి మోడల్ గా ఉన్న ఆమెను చేసుకున్నాడు.
నుస్రత్ మరణించిన వెంటనే ఆలియా ప్రేమలో పడ్డాడు ఈ పీఎం. ఆలియా పేరు మీద హానీ బ్రిడ్జి కట్టారని కథ ప్రచారంలో ఉంది. సౌదీలో ప్రవాస కాలంలో విడాకులు తీసుకున్నాక బంధం ముగిసింది.
అదే ఏడాది నీలోఫర్ ఖోసాతో పెళ్లి జరిగింది.జస్టిస్ ఆసిఫ్ సియాద్ ఖోసా సోదరి. వారి పెళ్లిని అంగీకరించ లేదు విడాకులతో ముగిసింది.2003లో తెహ్మీనా దుర్రానీని వివాహం చేసుకున్నారు.
ఎనిమిదేళ్ల బంధం వుంది. ఆమె రచయిత్రి. కళాకారిణి. కార్యకర్త కూడా. షెహబాజ్ షరీఫ్ తన ఐదో భార్య కల్సూమ్ హైతో రహస్య వివాహం చేసుకున్నారు. ఆమె గతంలో తిరస్కరించారు. మొత్తంగా మనోడు పెళ్లిళ్ల రాయుడిగా ప్రసిద్ది చెందాడు.
Also Read : ఉగ్రవాదం పాకిస్తాన్ పాలిట శాపం – పీఎం