Kodali Nani : దమ్ముంటే బాబు..లోకేశ్ నాపై పోటీ చేయాలి
కొడాలి నాని సంచలన కామెంట్స్
Kodali Nani : ఏపీ రాష్ట్ర మంత్రి కొడాలి నాని సంచలన కామెంట్స్ చేశారు. మరోసారి తెలుగుదేశం పార్టీ చీఫ్, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్ లపై నిప్పులు చెరిగారు. దమ్ముంటే తనపై గుడివాడలో తండ్రీకొడుకులు పోటీకి దిగాలని సవాల్ విసిరారు. కొడాలి నాని మీడియాతో మాట్లాడారు.
బాబైనా ఆయన బాబైనా లేక ఎన్నారై అయినా ఎవరైనా సరే అంతా కలిసి పోటీ చేసినా తాను బరిలో దిగేందుకు రెడీగా ఉన్నానని స్పష్టం చేశారు. వందల కోట్లు ఖర్చు పెట్టినా గుడివాడ ప్రజలు అమ్ముడు పోరని అన్నారు. ప్రవాస భారతీయులు , పొలిటికల్ ఎనలిస్ట్ లు విజయం సాధించరన్నారు.
కుల సంఘాలు ప్రభావం చూపించవన్నారు. తన కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు వైసీపీ విజయం కోసం పోరాడుతానని ప్రకటించారు కొడాలి నాని. చంద్రబాబు నాయుడు కొడాలి నానికి(Kodali Nani) చెక్ పెట్టేందుకు ప్లాన్ చేశారు. ఏపీకి చెందిన ఎన్నారై వెనిగళ్ల రామును బరిలోకి దింపేందుకు కార్యాచరణ ప్రణాళికలో మునిగి పోయారు.
వచ్చే నెల నుంచి ఈ ఎన్నారై ప్రచారంలో పాల్గొంటారని ప్రకటించారు టీడీపీ అధినేత. ఇప్పటికే చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం ఆయన రాయలసీమలో పర్యటిస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో నాలుగు స్తంభాలట కొనసాగనుంది. అధికారంలో ఉన్న వైసీపీ, టీడీపీ, బీజేపీ, జనసేన రంగంలో ఉన్నాయి.
గుడివాడలో 2 లక్షల 10 వేల మంది ఓటర్లు ఉన్నారు. ఒక్కో ఓటరకు టీడీపీ రూ. 5 వేలు లేదా రూ. 10 వేలు పంపిణీ చేసినా కోట్లు కుమ్మరించినా కొడాలి నానికి తప్ప ఇంకెవరికీ ఓట్లు వేయరని స్పష్టం చేశారు.
Also Read : కల్లు గీత కార్మికుల గోస పట్టని కేసీఆర్