Keerthy Suresh Messi : కీర్తి సురేష్..మెస్సీ హల్ చల్
ఐ లవ్ యూ అంటూ వైరల్
Keerthy Suresh Messi : చేసినవి కొన్ని సినిమాలే అయినా తక్కువ కాలంలోనే అద్భుతమైన నటిగా పేరు పొందింది కీర్తిక సురేష్. తెలుగు సినిమా రంగంపై చెరగలేని ముద్ర వేసిన దివంగత నటి సావిత్రికి సంబంధించి తీసిన మహానటి చిత్రం అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంది.
అంతే కాదు సావిత్రి పాత్రలో ఒదిగి పోయిన కీర్తి సురేష్ కు దేశ వ్యాప్తంగా మంచి పేరు తీసుకు వచ్చేలా చేసింది. ఇదే సమయంలో జాతీయ స్థాయిలో పలు అవార్డులు అందుకున్నారు కీర్తి సురేష్.
ఇటీవల గీత గోవిందం దర్శకుడు పరుశురామ్ దర్శకత్వంలో ప్రిన్స్ మహేష్ బాబు, కీర్తి సురేష్ నటించిన సర్కారు వారి పాట సూపర్ సక్సెస్ అయ్యింది. ప్రస్తుతం సౌత్ ఇండియాలో టాప్ హీరోయిన్లలో ఒకరుగా నిలిచింది.
ప్రస్తుతం కీర్తి సురేష్ ట్విట్టర్ లో ట్రెండింగ్ గా మారింది. సినిమా పరంగా కాదు. ఆమెకు ఫుట్ బాల్ ఆట అంటే అత్యంత ఇష్టం. అంతే కాదు అర్జెంటీనా సూపర్ స్టార్ ప్లేయర్ గా పేరొందిన మెస్సీ అంటే కీర్తి సురేష్(Keerthy Suresh Messi) కు చచ్చేంత అభిమానం. ఆమె గతంలో ఏకంగా మెస్సీ పేరుతో జెస్సీని వేసుకుంది.
ఆ ఫోటో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారింది. ప్రస్తుతం ఖతార్ వేదికగా ఫిఫా అంతర్జాతీయ ఫుట్ బాల్ మెగా టోర్నమెంట్ కొనసాగుతోంది. ఇదిలా ఉండగా మెస్సీ సారథ్యంలోని అర్జెంటీనా సౌదీ అరేబియా చేతిలో 2-1 తేడాతో ఓటమి పాలైంది. కాగా ఇదే తన కెరీర్ లో చివరి టోర్నీ అంటూ సంచలన ప్రకటన చేశాడు మెస్సీ. మొత్తం మీద కీర్తి సురేష్ వైరల్ గా మారారు.
Also Read : ఐసీసీ టి20 ర్యాంకింగ్స్ లో సూర్య భాయ్ టాప్