Amber Heard Top : గూగుల్ సెర్చింగ్ లో ‘ముద్దుగుమ్మ’నే టాప్
తర్వాతి స్థానంలో మాజీ ప్రియుడు జానీ డెప్
Amber Heard Top : ఏదైనా కావాలంటే మొదటగా గుర్తుకు వచ్చేది గూగుల్. ఏ సమాచారం కావాలన్నా క్షణాల్లో మన ముందుకు తీసుకు వచ్చే అద్భుతం ఈ సెర్చింగ్ ఇంజన్. గతంలో యాహూ ఉండేది. కానీ ఎప్పుడైతే లారీ పెజ్ తో పాటు ఇతరులు గూగుల్ ను తీసుకు వచ్చారో దాని దెబ్బకు మిగతావన్నీ అడ్రస్ లేకుండా పోయాయి.
ప్రస్తుతం యాహూ, ఎంఎస్ఎన్ ఉన్నా లేనట్టుగా మారి పోయాయి. ఇక ప్రతి ఏటా గూగుల్ ఏయే అంశాలను, ఎవరిని ఎక్కువగా వెతికాయో అని జాబితా ప్రకటిస్తుంది. ఇక ఈ ఏడాది ప్రపంచ వ్యాప్తంగా పలు ఆసక్తికరమైన సన్నివేశాలు చోటు చేసుకున్నాయి.
ప్రధానంగా హాలీవుడ్ లో విల్ స్మిత్ వివాదం, అలాగే ప్రముఖ నటీ నటులు అంబర్డ్ హార్డ్ , జానీ డెప్ ల మధ్య పరువు నష్టం దావా కేసు ప్రాధాన్యత సంతరించుకుంది. దీంతో ముద్దుగుమ్మ ఎవరంటూ ఎక్కువగా వెతికారట. ఇదే విషయాన్ని శనివారం వెల్లడైంది. ఎక్కువ మంది నెటిజన్లు పెద్ద ఎత్తున సెలెబ్రిటీలను వెదికారు.
వారిలో అత్యధికంగా సెర్చ్ చేసింది మాత్రం అంబర్డ్ హర్డ్(Amber Heard Top). ఈ ముద్దుగుమ్మ టాప్ లో నెంబర్ వన్ గా నిలిచింది. ఆ తర్వాతి రెండో స్థానంలో తన మాజీ ప్రియుడు జానీ డెప్ ఉండగా క్వీన్ ఎలిజబెత్ -2 , టామ్ బ్రాడీ, కిమ్ , పీట్ డేవిడ్సన్ , ఎలాన్ మస్క్ , విల్ స్మిత్ తర్వాతి స్థానాల్లో నిలిచారు.
ఇక వెబ్ సైట్స్ విషయానికి వస్తే యూట్యూబ్ నెంబర్ వన్ గా నిలిచింది. ఫేస్ బుక్ , ట్రాన్స్ లేట్ , పోర్న్ హబ్ , వెదర్ , అమేజాన్ , గూగుల్ ట్రాన్స్ లేట్ , జీ మెయిల్ , వాట్సాప్ వెబ్ , ట్రాడక్టర్ చోటు దక్కించుకున్నాయి.
Also Read : మమతా బెనర్జీకి గౌరవ డాక్టరేట్