Swara Bhasker Rahul Yatra : రాహుల్ యాత్రలో ‘స్వర భాస్కర్’
సంఘీభావం తెలిపిన నటి
Swara Bhasker Rahul Yatra : రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో ప్రముఖ నటి స్వర భాస్కర్(Swara Bhasker) పాల్గొన్నారు. ఇప్పటికే ఆయన యాత్ర తమిళనాడులోని కన్యాకుమారి నుంచి మొదలై , తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్ర ప్రదేశ్ , తెలంగాణ, మహారాష్ట్రలలో ముగిసింది. ప్రస్తుతం మధ్య ప్రదేశ్ లో కొనసాగుతోంది.
ఈ సందర్భంగా ప్రసిద్ద నగరమైన ఉజ్జయినిలో గురువారం నిర్వహించిన రాహుల్ యాత్రలో స్వర భాస్కర్ పాల్గొన్నారు. రాహుల్ తో పాటు ఆమె కూడా చాలా సేపు నడిచారు. ఇదిలా ఉండగా ఆమె కంటే ముందు సినిమా రంగానికి చెందిన పూజా భట్ , సుశాంత్ సింగ్ , రష్మీ దేశాయ్ , రియా సేన్ , అమోల్ పాలేకర్ , పూనమ్ కౌర్ , ఇతరులు పాల్గొన్నారు.
కాగా స్వర భాస్కర్ మొదటి నుంచి భారతీయ జనతా పార్టీ అభిప్రాయాలను వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ఆపై మోదీని, ఇతర నేతలను టార్గెట్ చేశారు. సోషల్ మీడియా వేదికగా కీలక నిర్ణయాలను తప్పు పడుతూ సంచలనంగా మారారు. ఎన్నికల్లో ఎదురు దెబ్బలు, ట్రోలింగ్ , వ్యక్తిగత దాడులు ఉన్నప్పటికీ రాహుల్ గాంధీ ప్రయత్నాలను స్వర భాస్కర్(Swara Bhasker) ప్రశంసించారు.
ఈ మేరకు తానే స్వయంగా కాంగ్రెస్ అగ్ర నాయకుడితో జత కట్టారు. మత పరమైన వాక్ చాతుర్యం లేదు. సంచలనాత్మక రాజకీయాలకు లొంగి పోలేదు. ద్వేషంతో నిండి పోయిన దేశాన్ని బాగు చేసేందుకు చేస్తున్న రాహుల్ ప్రయత్నం గొప్పదంటూ స్వర భాస్కర్ ట్విట్టర్ వేదికగా స్పష్టం చేశారు.
ప్రస్తుతం రాహుల్ చేపట్టిన యాత్రకు పెద్ద ఎత్తున జనాదరణ లభిస్తోంది.
Also Read : ఖర్గే కామెంట్స్ మోదీ సీరియస్