Agencies Raids Comment : దాడులు స‌రే అరెస్ట్ ల మాటేమిటి

ఎంత‌కాలం ఈ నికృష్ట రాజ‌కీయం

Agencies Raids Comment : మోదీ ప్ర‌భుత్వం వ‌చ్చాక కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌లు దూకుడు పెంచాయి. ఒక ర‌కంగా గ‌తంలో పాల‌కుల కంటే కాషాయ స‌ర్కార్ క‌న్నెర్ర చేయ‌డం ఆ వెంట‌నే రంగంలోకి దిగ‌డం ష‌రా మామూలై పోయింది. ఈ దాడులు , సోదాలు, కేసులు, అరెస్ట్ లు, బెయిళ్లు, రిమాండ్ లు, క‌స్ట‌డీల‌కు తీసుకోవ‌డాలు జ‌నాల బుర్ర‌ల‌కు బాగా ఎక్కాయి.

అలా చేసినందుకు ప్ర‌ధానిని, అమిత్ చంద్ర షాను ఒప్పు కోవాల్సిందే. ఎందుకంటే కేంద్ర హొం శాఖతో పాటు కోట్లాది రూపాయ‌లు క‌లిగిన స‌హ‌కార శాఖ కూడా ట్ర‌బుల్ షూట‌ర్ వ‌ద్దే ఉంది గనుక‌.

మ‌రో వైపు కేవ‌లం బీజేపీయేత‌ర రాష్ట్రాలు, నాయ‌కులు, సంస్థ‌లు, త‌మ‌ను ప్ర‌శ్నించే వారిపైనే ద‌ర్యాప్తు సంస్థలు ఫోక‌స్ పెడుతున్నాయ‌న్న ఆరోప‌ణ‌లు

ఉన్నాయి. వీటిని ప‌క్క‌న పెడితే భారీ ఎత్తున ఈడీ(Agencies Raids) రంగంలోకి దిగుతోంది. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. 

కానీ ఇప్ప‌టి వ‌ర‌కు దేశాన్ని నాశ‌నం చేసి, బురిడీ కొట్టించి, ప్ర‌భుత్వ రంగాల బ్యాంకుల‌కు క‌న్నం వేసి ల‌క్ష‌ల కోట్లు కొల్ల గొట్టి విదేశాల‌కు చెక్కేసి ఎంచ‌క్కా ఎంజాయ్ చేస్తున్న ఆర్థిక నేర‌గాళ్లను ఎందుకు అరెస్ట్ చేయ‌డం లేదంటూ 137 కోట్ల మంది భార‌తీయులు ప్ర‌శ్నిస్తున్నారు.

ఒక ర‌కంగా నిల‌దీస్తున్నారు. అయితే రాజ‌కీయ కార‌ణాలు ప‌క్క‌న పెడితే ఒత్తిళ్లు ఉండ‌డం స‌హ‌జం. విధులు అన్నాక ప్ర‌ధానంగా ద‌ర్యాప్తు చేయ‌డం, అందుకు త‌గ్గ ఆధారాలు సేక‌రించ‌డం, డాక్యుమెంట్ల‌ను ప‌రిశీలించ‌డం , వాటిని స‌బ్మిట్ చేయ‌డం త‌ల‌కు మించిన భారం. ప్ర‌స్తుతం కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌లైన సీబీఐ, ఈడీ, ఐటీ, ఎన్ఐఏ , త‌దిత‌ర సంస్థ‌లన్నీ రెడీగా ఉన్నాయి.

ఎక్క‌డ ప‌డితే అక్క‌డ దాడులు చేస్తున్నాయి. ఒక ర‌కంగా అభినందించాల్సిందే. ఈడీ కుప్ప‌లు తెప్ప‌లుగా రైడ్స్(Agencies Raids) చేస్తూ పోతోంది. కానీ

కోర్టు దాకా వ‌చ్చే దాకా లొసుగుల‌ను ఆధారంగా చేసుకుని కొద్ది కాలం శిక్ష అనుభ‌వించ‌డం ఆ త‌ర్వాత బెయిల్ పొంద‌డం ష‌రా మామూలై పోయింది.

ఒక ర‌కంగా న్యాయ వ్య‌వ‌స్థ‌లు స‌రిగా ప‌ని చేసిన‌ట్ల‌యితే ఈ దేశంలో 90 శాతం మంది పొలిటిక‌ల్ లీడ‌ర్లు, వ్యాపార‌వేత్త‌లు , ఇత‌ర రంగాల‌కు చెందిన

వారంతా జైళ్ల‌ల్లోనే ఉండి పోవాల్సి వ‌స్తుంది. వీళ్లంద‌రూ కొల్ల‌గొట్టిన సంప‌ద మామూలు కాదు.

ఈ దేశానికి దాదాపు 50 ఏళ్ల పాటు క‌రువు వ‌చ్చినా ఆదుకునేంత సొమ్ము, బంగారం, ఇత‌ర ఆస్తులు ఉన్నాయ‌నేది బ‌హిరంగ ర‌హ‌స్యం. విచిత్రం ఏమిటంటే రొటమాక్ పెన్నుల త‌యారీ పేరుతో ఏకంగా వంద‌లాది కోట్లు కొల్ల‌గొట్టారు.

ఇటీవ‌లే బొట్టు బిల్ల‌ల త‌యారీ పేరుతో రూ. 200 కోట్లు కొల్ల‌గొట్టిన‌ట్లు స‌మాచారం. బ్యాంకులు ఏం చేస్తున్నాయి. ఆర్బీఐ నిద్ర పోతోందా అన్న అనుమానం 

నెల‌కొంది. ఇక కేంద్ర , రాష్ట్ర ప్ర‌భుత్వాలే మోస‌గాళ్ల‌కు, వ్యాపార‌వేత్త‌లకు, బడా సంస్థ‌ల‌కు, కార్పొరేట్ కంపెనీల‌కు ఎర్ర తివాచీ ప‌ర్చ‌డం క్షమించ‌రాని నేరం.

తాజాగా దేశాన్ని ఒక్క‌సారిగా విస్తు పోయేలా చేసింది ఢిల్లీ లిక్క‌ర్ స్కాం. విచిత్రం ఏమిటంటే ఇందులో బ‌డా వ్యాపార‌వేత్త‌లు, ఓ సీఎం కూతురు కూడా

ఉండ‌డం బాధాక‌రం. ఏది ఏమైనా ద‌ర్యాప్తు సంస్థ‌ల నిజాయితీని శంకించ‌డం లేదు.

కానీ ఎంత త్వ‌ర‌గా కేసుల‌ను మూసేసి..అరెస్ట్ చేసి..జీవిత ఖైదీలుగా ప్ర‌క‌టిస్తేనే వ్య‌వ‌స్థ బాగు ప‌డుతుంది. లేక‌పోతే దేశం పుచ్చిపోతుంది.

Also Read : త్వ‌ర‌లో దొంగ‌లు ఎవ‌రో తేలుతుంది – ఈట‌ల

Leave A Reply

Your Email Id will not be published!