Bear Grylls Zelensky : జెలెన్ స్కీ ధైర్యం అద్భుతం – బేర్ గిల్స్
ప్రముఖ సాహసికుడు..రచయిత..ప్రజెంటర్
Bear Grylls Zelensky : ఎవరీ ఎడ్వర్డ్ బేర్ గిల్స్ అనుకున్నారా. ప్రపంచంలో మోస్ట్ పాపులరాటి కలిగిన బ్రిటన్ కు చెందిన సాహసికుడు, రచయిత, టెలివిజన్ వ్యాఖ్యాత. అంతే కాదు గొప్ప వ్యాపారవేత్త కూడా. ఆయన టెలివిజన్ ధారావాహిక మ్యాన్ వర్సెస్ వైల్డ్ కోసం 2006 నుంచి 2011 దాకా పని చేశాడు.
అద్భుతమైన రేటింగ్ తో ఆకట్టుకుంది. ఈ ప్రోగ్రాం ద్వారా వరల్డ్ వైడ్ గా పేరొందాడు. యుకె, యుఎస్ లలో రన్నింగ్ వైల్డ్ విత్ బేర్ గ్రిల్స్ , ది ఐలాండ్ విత్ బేర్ గ్రిల్స్(Bear Grylls) వంటి అనేక టెలివిజన్ సీరీస్ లలో పాల్గొన్నాడు. జూలై 2009లో గ్రిల్స్ 35 ఏళ్ల వయస్సులో యుకె, ఓవర్సీస్ టెరిటరీలో అతి పిన్న వయస్కుడైన చీఫ్ స్కౌట్ గా నియమించబడ్డాడు.
బేర్ గిల్స్ 2015 నుంచి రెండోసారి కొనసాగిస్తూ వస్తున్నాడు. ఈ సందర్భంగా మరోసారి వార్తల్లోకి వచ్చాడు బేర్ గిల్స్. రష్యా నిత్యం యుద్దం చేస్తున్న ఉక్రెయిన్ దేశాన్ని పర్యటించారు. ఈ సందర్భంగా యుద్దంలో దెబ్బతిన్న ప్రదేశాలను దగ్గరుండి చూశాడు బేర్ గిల్స్(Bear Grylls).
ఉక్రెయిన్ దేశ రాజధాని లో దేశ అధ్యక్షుడు జెలెన్ స్కీ తో పంచుకున్న అనుభవాలను , గడిపిన క్షణాలను పంచుకున్నారు. ట్విట్టర్ వేదికగా బేర్ గిల్స్ పంచుకున్నారు. ఇదిలా ఉండగా ఫిబ్రవరి నుండి ఉక్రెయిన్ పై రష్యా నుండి నిప్పులు చెరుగుతోంది. అడ్వెంచర్ షో హోస్ట్ జెలెన్ స్కీతో ప్రత్యేక షోలో వివరాలు పంచుకున్నారు.
ఈ వారం నేను కైవ్ కు వెళ్లాను. నాకు మరెవ్వరికీ లేని అనుభవం కలిగిందని పేర్కొన్నారు బేర్ గ్రిల్స్. రష్యా దాడిలో మిలియన్ల మంది ప్రజల మనుగడ అనేది చాలా నిజమైన రోజూ వారీ పోరాటం ఈ ప్రత్యేక కార్యక్రం ద్వారా చూడని ప్రపంచాన్ని జెలెన్ స్కీ వైపు చూస్తుందన్నారు.
Also Read : ఎలాన్ మస్క్ పై జెలెన్ స్కీ ఫైర్