Rakul Preet Singh Rohit Reddy : రకుల్..రోహిత్ కు ఈడీ షాక్
డ్రగ్స్ కేసులో నోటీసులు
Rakul Preet Singh Rohit Reddy : మరోసారి డ్రగ్స్ వ్యవహారం తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా ఇటీవల ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో నలుగురు ఎమ్మెల్యేలలో ఒకరైన పైలట్ రోహిత్ రెడ్డికి ఇందులో భాగం ఉందంటూ కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ నోటీసులు జారీ చేసింది. ఆయనతో పాటు ప్రముఖ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్(Rakul Preet Singh) కు కూడా నోటీసు ఇచ్చింది.
నటికి ఈనెల 19న తమ ముందు హాజరు కావాలని నోటీసులో పేర్కొంది. విచారణకు తప్పనిసరిగా హాజరు కావాల్సిందేనంటూ స్పష్టం చేయడం విశేషం. ఓ వైపు సీఎం కూతురు ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఇప్పటికే సీబీఐతో విచారణ ఎదుర్కొంది. ఈ తరుణంలో అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన రోహిత్ రెడ్డికి ఈడీ డ్రగ్స్ కేసులో నోటీసు పంపించడం కలకలం రేపింది.
ఆర్థిక లావాదేవీలకు సంబంధించి నోటీసు ఇచ్చినట్లు సమాచారం. గతంలో కర్ణాటక లోని బెంగళూరు డ్రగ్స్ కేసు అప్పట్లో సంచలనం రేపింది. తెలుగు రాష్ట్రాలలో అది హాట్ టాపిక్ గా మారింది. ఆ తర్వాత ప్రముఖ సినీ రంగానికి చెందిన నటీ నటులు కూడా విచారణకు హాజరయ్యారు.
కానీ ఆ తర్వాత ఎందుకనో కంటిన్యూ కాలేదు. సద్దు మణిగిన డ్రగ్స్ కేసు మళ్లీ తెరపైకి రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఫామ్ హౌస్ కేసులో కూడా ఇటీవలే ఆయనను విచారించారు. ఇక పైలట్ రోహిత్ రెడ్డి(Rohit Reddy) వ్యాపార లావాదేవీల వ్యవహారంపై కూడా ప్రశ్నించే అవకాశం ఉన్నట్లు బయట టాక్ నడుస్తోంది.
Also Read : హక్కులు..స్వేచ్చపై అమితాబ్ కామెంట్స్