FIFA World Cup 2022 Final : సాక‌ర్ స‌మ‌రం ఫైన‌ల్ కు సిద్దం

అర్జెంటీనా వ‌ర్సెస్ ఫ్రాన్స్ ఫైట్

FIFA World Cup 2022 Final : ఖ‌తార్ వేదిక‌గా జ‌రుగుతున్న ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2022(FIFA World Cup 2022 Final) ఆఖ‌రి అంకానికి చేరింది. కేవ‌లం ఒకే ఒక్క అడుగు దూరంలో ప్ర‌పంచ క‌ప్ ఊరిస్తోంది. సాక‌ర్ ప్ర‌పంచంలో మోస్ట్ డేంజ‌రస్ ఆట‌గాడిగా పేరొందిన అర్జెంటీనా దిగ్గ‌జం లియోనెల్ మెస్సీ సార‌థ్యంలోని అర్జెంటీనా ఫ్రాన్స్ తో ఫైన‌ల్ పోరుకు త‌ల‌పడేందుకు రెడీ అయ్యింది.

ఆదివారం ఖ‌తార్ లో జ‌రిగే ఫైన‌ల్ మ్యాచ్ కోసం కోట్లాది మంది అభిమానులు వేయి క‌ళ్ల‌తో ఎదురు చూస్తున్నారు. ఎవ‌రు గెలుస్తార‌నేది ప‌క్క‌న పెడితే..ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ త‌న‌కు ఆఖ‌రు అని ప్ర‌క‌టించాడు లియోనెల్ మెస్సీ. దీంతో ఫుట్ బాల్ మాంత్రికుడి ఆట కోసం ఎదురు చూస్తున్నారు.

మ‌రికొంద‌రు క‌న్నీటి ప‌ర్యంతం అవుతున్నారు. తాజాగా అర్జెంటీనాకు చెందిన ఓ సీనియ‌ర్ లేడీ జ‌ర్న‌లిస్ట్ అయితే ఇంట‌ర్వూ మ‌ధ్య‌లోనే మెస్సీని చూస్తూ కంట త‌డి పెట్టింది. ఇందుకు సంబంధించిన వీడియో వైర‌ల్ గా మారింది. డిగో మార‌డోనా త‌ర్వాత అంత‌డి పేరు ప్ర‌ఖ్యాతులు సంపాదించుకున్న మెస్సీ త‌న చివ‌రి క‌ల సాధిస్తాడా అన్న‌ది ఉత్కంఠ‌గా మారింది.

మొత్తం 32 జ‌ట్లు పాల్గొన్న ఈ ఫిఫా వ‌రల్డ్ క‌ప్ లో చివ‌ర‌కు అర్జెంటీనా, ఫ్రాన్స్ నిలిచాయి. ఫ్రాన్స్ మొరాకోను 2-0 తేడాతో మ‌ట్టి క‌రిపిస్తే , మెస్సీ సార‌థ్యంలోని అర్జెంటీనా క్రొయేషియాను 3-0 తేడాతో ఓడించి చ‌రిత్ర సృష్టించింది. వ‌ర‌ల్డ్ క‌ప్ చ‌రిత్ర‌లో అరుదైన ఘ‌ట్టం ఆవిష్కృతం కానుంది. మ‌రి ఎవ‌రు విజేత‌గా నిలుస్తార‌నేది కాల‌మే స‌మాధానం చెప్పాల్సి ఉంది.

Also Read : భార‌త క్రికెట‌ర్ల‌కు ఖుష్ క‌బ‌ర్

Leave A Reply

Your Email Id will not be published!