Anushka Sharma Slams : స్పోర్ట్స్ వేర్ బ్రాండ్ పై అనుష్క ఫైర్
పర్మిషన్ లేకుండా ఫోటోలు షేర్
Anushka Sharma Slams : ప్రముఖ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య, నటి అనుష్క శర్మ సీరియస్ (Anushka Sharma Slams) అయ్యారు. తన అనుమతి లేకుండా అభ్యంతకర ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో స్పందించారు. ఈ మేరకు తాను బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న స్పోర్ట్స్ వేర్ సంస్థపై నిప్పులు చెరిగారు. తన అనుమతి తీసుకోకుండా ఎలా పోస్ట్ చేస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
వెంటనే వాటిని తొలగించాలని కోరారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ఇన్ స్టా గ్రామ్ లో వైరల్ గా మారాయి. ఇక నుంచి నేను మీ బ్రాండ్ అంబాసిడర్ ను కానంటూ మండిపడింది. తనను పదవి నుంచి తొలగించాలని సూచించారు స్పోర్ట్స్ వేర్ బ్రాండ్ కు. ఆ పోస్ట్ ను వెంటనే తొలగించాలంటూ కోరింది.
అయితే సదరు కంపెనీ తమ సంస్థకు సంబంధించి సీజన్ సేల్ ను ప్రకటించేందుకు వివిధ దుస్తులలో ఉన్న అనుష్క శర్మ చిత్రాలను షేర్ చేసింది. కొన్ని గంటల తర్వాత ఆమె తన ఇన్ స్టా గ్రామ్ స్టోరీస్ లో పోస్ట్ ను మళ్లీ షేర్ చేసింది. పోస్ట్ తో పాటు ఘాటుగా రాసింది.
పుమా ఇండియా..నేను మీ అంబాసిడర్ ను కాను కాబట్టి వెంటనే నా ఫోటోలను ప్రచారం కోసం ఉపయోగించాలంటే ముందుగా మీరు నా అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. దయచేసి దానిని తొలగించండి అంటూ కోరింది అనుష్క శర్మ.
విచిత్రం ఏమిటంటే తన భర్త, భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ అభ్యంతకరంగా ఉన్న ఫోటోలను లైక్ చేయడం విస్తు పోయేలా చేసింది.
Also Read : దీపికా నిన్ను చూస్తే గర్వంగా ఉంది