Tarun Chugh Kavitha : అమ్మో క‌వితా మామూలు లేదుగా – చుగ్

లిక్క‌ర్ స్కాంలో ఆమె పాత్ర ఏంటో చెప్పాలి

Tarun Chugh Kavitha : భార‌తీయ జ‌న‌తా పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్య‌వ‌హారాల ఇన్ చార్జ్ త‌రుణ్ చుగ్(Tarun Chugh)  షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయ‌న సీఎం కేసీఆర్ , ఆయ‌న కూతురు ఎమ్మెల్సీ క‌విత‌ను , ఫ్యామిలీని టార్గెట్ చేశారు. కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌లు సీబీఐ, ఈడీ స‌మ‌ర్పించిన ఛార్జ్ షీట్ లు చూస్తుంటే స్పృహ త‌ప్పి ప‌డిపోయేలా అనిపించింద‌న్నారు.

కోరి తెచ్చుకున్న తెలంగాణ‌లో కేవ‌లం కేసీఆర్ ఫ్యామిలీ మాత్రమే బాగు ప‌డింద‌ని ఆరోపించారు. ఢిల్లీ లిక్క‌ర్ స్కాంలో ఎమ్మెల్సీ క‌విత పాత్ర మామూలుగా లేద‌న్న విష‌యం బ‌ట్ట బ‌య‌లు అయ్యింద‌న్నారు. ఇన్ని డ‌బ్బులు ఎక్క‌డి నుంచి వ‌చ్చాయో, ఏం చేస్తే వ‌చ్చాయో చెప్పాల‌ని డిమాండ్ చేశారు త‌రుణ్ చుగ్(Tarun Chugh) .

ఆయ‌న బుధ‌వారం మీడియాతో మాట్లాడారు. తాము ఇన్నేళ్లు పార్టీలో ఉన్నా ఇప్ప‌టి వ‌ర‌కు ఇన్ని సౌక‌ర్యాలు లేవ‌న్నారు. ఢిల్లీ లిక్క‌ర్ స్కాంకు సంబంధించి ఢిల్లీలోని ఒబేరాయ్ హోటల్ లో ఎమ్మెల్సీ క‌విత స‌మావేశాలు జ‌రిపిన మాట వాస్త‌వం కాదా అని ప్ర‌శ్నించారు. స‌మీర్ మ‌హీంద్రుతో క‌విత‌కు ఉన్న సంబంధం ఏమిటో, ఆ వ్యాపారాల క‌థేమిటో ప్ర‌జ‌ల‌కు తెలియ చేయాల‌న్నారు.

నిన్న‌టి దాకా బ‌తుకమ్మ‌తో బ్రాండ్ అంబాసిడ‌ర్ గా ఉన్న క‌విత‌క్క(MLC Kavitha) ఇప్పుడు లిక్క‌ర్ క్వీన్ గా ఎలా మారిందో కూడా తెలుసుకుంటే బావుంటుంద‌న్నారు. మ‌ద్యం స్కాంకు సంబంధించి మ‌రోసారి క‌ల్వ‌కుంట్ల క‌విత బండారం బ‌య‌ట ప‌డింద‌ని, దీనిని ఈడీ 28 సార్లు త‌న ఛార్జ్ షీట్ లో ప్ర‌స్తావించింద‌న్నారు.

ముందు ధ్వంసం చేసిన ఆ 11 ఫోన్ల క‌థేంటో సీఎం కేసీఆర్ చెప్పాల‌న్నారు. అంతే కాకుండా తెలంగాణ‌, పంజాబ్, ఢిల్లీ లిక్క‌ర్ స్కాంల‌పై విచార‌ణ జ‌ర‌పాల‌ని త‌రుణ్ చుగ్ డిమాండ్ చేశారు.

Also Read : బ్యాంకుల‌కు రూ. 92,570 కోట్లు టోక‌రా

Leave A Reply

Your Email Id will not be published!