Komatireddy Raj Gopal Reddy : చెల్లీ నిజం నిప్పు లాంటిది

కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి ఫైర్

Komatireddy Raj Gopal Reddy : తాను చేసిన కామెంట్స్ ను ఎద్దేవా చేస్తూ ట్వీట్ చేసిన ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత‌కు స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు మాజీ ఎమ్మెల్యే, భార‌తీయ జ‌న‌తా పార్టీ నాయ‌కుడు కోమ‌టిరెడ్డి రాజ గోపాల్ రెడ్డి(Komatireddy Raj Gopal Reddy) . చెల్లీ తొంద‌రెందుకు జ‌ర ఆగు. త్వ‌ర‌లోనే జైలు ఊచ‌లు లెక్క బెట్టుడు ఖాయం అంటూ జోష్యం చెప్పారు.

ఆయ‌న ట్విట్ట‌ర్ వేదిక‌గా రియాక్ట్ అయ్యారు. కీల‌క వ్యాఖ్య‌లు చేయ‌డం క‌ల‌క‌లం రేపింది. ప్ర‌స్తుతం తెలంగాణ‌లో మాట‌ల యుద్దంతో పాటు ట్వీట్ల వార్ కొన‌సాగుతోంది. ఒక‌రిపై మ‌రొక‌రు నిప్పులు చెరుగుతున్నారు. ఓ వైపు అన్న కేటీఆర్ ద‌మ్ముంటే రా అంటూ బండి సంజ‌య్ కు స‌వాల్ విసిరారు.

నిరూపించ‌క పోతే చెప్పుతో కొట్టుకుంటవా అని ఫైర్ అయ్యారు. ఈ స‌మ‌యంలో ఢిల్లీ లిక్క‌ర్ స్కాంకు సంబంధించి మొన్న అమిత్ అరోరాకు సంబంధించి దాఖ‌లు చేసిన ఛార్జ్ షీట్ లో క‌విత(MLC Kavitha) పేరు ఉందంటూ తెలిపింది. ఈ మేర‌కు ఈనెల 11న విచార‌ణ కూడా చేప‌ట్టింది.

మ‌రో నోటీసు కూడా జారీ చేసింది. తాజాగా కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట పెట్టింది. ఢిల్లీ లిక్క‌ర్ స్కాంలో లిక్క‌ర్ క్వీన్ ఎమ్మెల్సీ క‌విత పాత్ర ఉందంటూ ఆరోపించింది. ఈ మేర‌కు 268 పేజీల నివేదిక‌లో 28 సార్లు ఆమె పేరును ప్ర‌స్తావించింది.

ఇదే విష‌యాన్ని ఎంపీ కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు. ట్వీట్ చేశారు. తొంద‌ర‌ప‌డ‌కు రాజ‌న్నా అబ‌ద్దం నిజం కాద‌ని పేర్కొంది ఎమ్మెల్సీ క‌విత‌. దీనిపై తిరుగు స‌మాధానం స్ట్రాంగ్ గా ఇచ్చారు ఎంపీ.

Also Read : క‌ర్ణాట‌క‌కు వెళ్లేందుకు ప‌ర్మిష‌న్ ఎందుకు

Leave A Reply

Your Email Id will not be published!