IND vs BAN 2nd Test 2022 : బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్

టాస్ ఓడిన టీమ్ ఇండియా

IND vs BAN 2nd Test 2022 : రెండు టెస్టుల సీరీస్ లో భాగంగా రెండో టెస్టు ప్రారంభ‌మైంది. ముందుగా బంగ్లాదేశ్ కెప్టెన్ ష‌కీబ్ హ‌స‌న్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు.

ఇప్ప‌టికే తొలి టెస్టులో గ్రాండ్ విక్ట‌రీ న‌మోదు చేసింది టీమ్ ఇండియా. వ‌న్డే సీరీస్ ను భార‌త్ కోల్పోయింది 1-2 తేడాతో. ఎలాగైనా రెండో టెస్టు గెలిచి పోయిన ప‌రువు కాపాడు కోవాల‌ని డిసైడ్ అయ్యింది.

ఇక గాయం కార‌ణంగా రోహిత్ శ‌ర్మ , న‌వ దీప్ షైనీ దూరంగా ఉన్నారు. నిన్న ప్రాక్టీస్ సెష‌న్ లో స్టాండ్ ఇన్ కెప్టెన్ కేఎల్ రాహుల్ గాయ‌ప‌డడం కొంత ఇబ్బంది క‌లిగింది. ఇదే విష‌యాన్ని బ్యాటింగ్ కోచ్ విక్ర‌మ్ రాథోడ్ వెల్ల‌డించాడు. ఇక రెండో టెస్టుకు తుది జ‌ట్టులో కుల్దీప్ యాద‌వ్ ను తొల‌గించించి జ‌ట్టు యాజ‌మాన్యం.

ఇక వ‌ర‌ల్డ్ టెస్ట్ ఛాంపియ‌న్ షిప్ కు సంబంధించి 55.77 పాయింట్ల‌తో భార‌త జ‌ట్టు(IND vs BAN 2nd Test 2022) రెండో స్థానంలో కొన‌సాగుతోంది. భార‌త జ‌ట్టులో కేఎల్ రాహుల్ కెప్టెన్ కాగా ఛ‌తేశ్వ‌ర్ పుజారా వైస్ కెప్టెన్ .

విరాట్ కోహ్లీ, రిష‌బ్ పంత్ (వికెట్ కీప‌ర్ ) , శ్రేయాస్ అయ్య‌ర్ , అక్ష‌ర్ ప‌టేల్ , ర‌విచంద్ర‌న్ అశ్విన్ , జ‌య‌దేవ్ ఉనాద్క‌త్, ఉమేష్ యాద‌వ్ , మ‌హ్మ‌ద్ సిరాజ్ ఆడ‌తారు.

ఇక బంగ్లాదేశ్ జ‌ట్టులో శాంటో, జ‌కీర్ హ‌స‌న్ , మోమునుల్ హ‌క్ , లిట్ట‌న్ దాస్ , ముష్పిక‌ర్ ర‌హీమ్ , ష‌కీబ్ అల్ హ‌స‌న్ , నూరుల్ హ‌స‌న్ , హ‌స‌న్ మిరాజ్ , తైజుల్ ఇస్లాం , ఖ‌లీద్ అహ్మ‌ద్, త‌స్కిన్ అహ్మ‌ద్ ఉన్నారు.

Also Read : ఐపీఎల్ వేలంలో అంద‌రి క‌ళ్లు వీరి పైనే

Leave A Reply

Your Email Id will not be published!