New Zealand Team Celebrate : క్రిస్మ‌స్ వేడుక‌ల్లో కీవీస్ ప్లేయ‌ర్స్

క‌రాచీలో సంద‌డి చేసిన ఆట‌గాళ్లు

New Zealand Team Celebrate : ఇంగ్లండ్ చేతిలో ఘోర‌మైన ప‌రాభవం త‌ర్వాత న్యూజిలాండ్ జ‌ట్టు ప్ర‌స్తుతం పాకిస్తాన్ లో ప‌ర్య‌టిస్తోంది. ఈ సంద‌ర్భంగా పాకిస్తాన్ కు చేరుకున్న న్యూజిలాండ్ క్రికెట‌ర్లు క్రిస్మ‌స్ పండుగ‌ను సెల‌బ్రేట్(New Zealand Team Celebrate) చేసుకున్నారు. ఇవాళ పాకిస్తాన్ తో తొలి టెస్టు ఆడ‌బ‌తోంది. పాకిస్తాన్ కెప్టెన్ బాబ‌ర్ ఆజ‌మ్ టాస్ గెలిచాడు.

ఇదిలా ఉండ‌గా కీవీస్ ఆట‌గాళ్లు ఆట ఆడేకంటే ముందు పెద్ద ఎత్తున వేడుక‌ల్లో పాల్గొన్నారు. తెగ ఎంజాయ్ చేశారు. కేక్ లు, డ్రింక్స్ తో హోరెత్తించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైర‌ల్ గా మారాయి. ఇక ఆదివారం ప్ర‌పంచ వ్యాప్తంగా క్రిస్మ‌స్ ఫెస్టివ‌ల్ ను సోద‌ర‌, సోద‌రీమ‌ణులు జ‌రుపుకున్నారు.

ఇళ్ల‌ను అలంక‌రించ‌డం, కేక్ లు, భోజ‌నాల‌తో సంద‌డి చేశారు. మ‌రికొంద‌రు ఇచ్చి పుచ్చుకోవ‌డం సెంట‌ర్ ఆఫ్ అట్రాక్ష‌న్ గా మారింది. ఇక పాకిస్తాన్ టూర్ లో ఉన్న‌ప్ప‌టికీ కీవీస్ ఆట‌గాళ్లు మాత్రం మ‌రిచి పోలేదు. ఈ జ‌ట్టు కూడా క్రిస్మ‌స్ వేడుక‌ల‌ను ఘ‌నంగా నిర్వ‌హించింది.

క‌రాచీ వేదిక‌గా క్రిస్మ‌స్ వేడుక‌లో సంద‌డి చేయ‌డం సంతోషాన్ని క‌లిగించింది. ఇక న్యూజిలాండ్ జ‌ట్టుకు కొత్త‌గా కెప్టెన్ గా నియ‌మితుల‌య్యారు టిమ్ సౌథీ. కేన్ విలియ‌మ్స‌న్ , అజాజ్ ప‌టేల్ , ఇష్ సోధి , త‌దిత‌ర ఆట‌గాళ్లు క్రిస్మ‌స్ వేడుక‌ల్లో సెంట‌ర్ ఆఫ్ ది అట్రాక్ష‌న్ గా నిలిచారు.

ఇదిలా ఉండ‌గా బెన్ స్టోక్స్ సార‌థ్యంలోని ఇంగ్లండ్ జ‌ట్టు పాకిస్తాన్ ను మ‌ట్టి క‌రిపించింది. ఏకంగా పాకిస్తాన్ టూర్ లో కోలుకోలేని షాక్ ఇచ్చింది. 3-0 తేడాతో కోలుకోలేని షాక్ ఇచ్చింది.

Also Read : ప‌టిష్ట స్థితిలో టీమిండియా

Leave A Reply

Your Email Id will not be published!