Salman Khan Kisses : ఖాన్ కిస్ సంగీతా బిజ్లానీ ఖుష్
ఐ లవ్ యూ చెప్పిన యాక్టర్
Salman Khan Kisses : బాలీవుడ్ దిగ్గజ నటుడు సల్మాన్ ఖాన్ ఏది చేసినా ఓ సంచలనమే. క్షణాల్లో ట్రెండ్ అవుతుంది. ఆపై నెట్టింట్లో హల్ చల్ కావడం ఖాయం. ఈ కండల వీరుడు తన పుట్టిన రోజును గ్రాండ్ గా జరుపుకున్నాడు. సినీ రంగానికి చెందిన నటీనటులే కాదు ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు కూడా పెద్ద ఎత్తున హాజరయ్యారు.
విచిత్రం ఏమిటంటే తను ఇప్పటి వరకు పలువురు నటీమణులతో డేటింగ్ చేశాడు. కానీ ఎవరినీ పెళ్లి చేసుకోలేదు. ఐశ్వర్యా రాయ్ ని పెళ్లి చేసుకుందామని అనుకున్నాడు. కానీ తన విచిత్ర ప్రవర్తనతో భయంతో ఆ దరి దాపుల్లోకి రాలేదు సోగకళ్ల సుందరి. చివరకు అమితాబ్ బచ్చన్ కు కోడలిగా వెళ్లింది. తాజాగా ఓ అరుదైన సన్నివేశం చోటు చేసుకుంది.
చాలా ఏళ్ల కిందట నటి సంగీతా బిజ్లానీతో డేటింగ్ చేశాడు సల్మాన్ ఖాన్. ఆయనకు బర్త్ డే చెప్పేందుకు వచ్చింది. ఆమె ప్రముఖ భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహమ్మద్ అజారుద్దీన్ తో చాలా కాలం రిలేషన్ షిప్ లో ఉన్నారు. కొంత కాలం నుంచి దూరంగా ఉన్నారు. ఈ తరుణంలో సంగీతా తళుక్కున మెరిసింది సల్మాన్ ఖాన్ బర్త్ డే పార్టీలో.
మనోడు ఏమనుకున్నాడో ఏమో కానీ ఏకంగా అంతా చూస్తుండగానే సంగీతా బిజ్లానీ నుదుటిపై ముద్దు(Salman Khan Kisses) పెట్టాడు. ఆపై ఆమె వెళుతుండగా ఐ లవ్ యూ అని కూడా చెప్పాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియో హల్ చల్ అవుతోంది. మరి అజారుద్దీన్ ఏమంటారో చూడాలి.
Also Read : ట్రెడిషనల్ లుక్స్ లో క్యూట్ గా పూజిత పొన్నాడ