Atul Bhatkhalkar Tunisha : ల‌వ్ జిహాద్ కోణంలో తునీషా కేసు

బీజేపీ ఎమ్మెల్యే అతుల్ భ‌త్ఖ‌ల్క‌ర్ వెల్ల‌డి

Atul Bhatkhalkar Tunisha : యువ న‌టి తునీషా శ‌ర్మ కేసు దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నంగా మారింది. స‌హ న‌టుడు షీజాన్ ఖాన్ త‌న కూతురు చ‌ని పోవ‌డానికి కార‌ణ‌మ‌ని మృతురాలి త‌ల్లి వ‌నితా శ‌ర్మ ఆరోపించారు. ఆదివారం ఉద‌యం షీజాన్ ఖాన్ ను అరెస్ట్ చేశారు పోలీసులు. కోర్టు నాలుగు రోజుల క‌స్ట‌డీకి అనుమ‌తి ఇచ్చింది. ఈ సంద‌ర్భంగా కీల‌క విష‌యాల‌ను వెల్ల‌డించిన‌ట్లు స‌మాచారం.

శ్ర‌ద్దా వాక‌ర్ ఘ‌ట‌న త‌ర్వాత తాను భ‌య‌ప‌డ్డాన‌ని పేర్కొన్నాడు. ఇదిలా ఉండ‌గా తునీషా శ‌ర్మ‌(Tunisha Sharma), షీజాన్ ఖాన్ గ‌త కొంత కాలం నుంచి ల‌వ్ లో ఉన్నారు. 15 రోజుల కింద‌ట తాను తునీషాకు బ్రేక‌ప్ చెప్పాడు ఖాన్. దీంతో త‌ట్టుకోలేక తునీషా శ‌ర్మ సీరియ‌ల్ సెట్ లో భాగంగా టాయిలెట్ లో ఉరి వేసుకుని ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డింది.

ఈ కేసుకు సంబంధించి ఆత్మ‌హ‌త్య లేక హ‌త్య అనే కోణంలో పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండ‌గా న‌టి తునీషా శ‌ర్మ కేసు వెనుక ల‌వ్ జిహాద్ కోణం ఉందంటూ ఇప్ప‌టికే భార‌తీయ జ‌న‌తా పార్టీకి చెందిన ఎమ్మెల్యే రామ్ క‌ద‌మ్ ఆరోపించారు. ఆయ‌న‌కు మ‌ద్ద‌తుగా మంత్రి గిరీష్ మ‌హాజ‌న్ కూడా ల‌వ్ జిహాద్ ప్ర‌భావం ఉంద‌ని, దానిపై విచార‌ణ జ‌రిపిస్తామ‌ని, అమ్మాయి కుటుంబానికి న్యాయం చేస్తామ‌ని ప్ర‌క‌టించారు.

బుధ‌వారం బీజేపీకి చెందిన ఎమ్మెల్యే అతుల్ భ‌త్ఖ‌ల్క‌ర్(Atul Bhatkhalkar) సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. ల‌వ్ జిహాద్ కోణంలో తునీషా శ‌ర్మ కేసును విచార‌ణ జ‌రుపుతార‌ని పేర్కొన్నారు.

Also Read : ఖాన్ కిస్ సంగీతా బిజ్లానీ ఖుష్

Leave A Reply

Your Email Id will not be published!