Rahul Sonia Viral : ‘రాహుల్ సోనియా’ వైర‌ల్

నెట్టింట్లో హ‌ల్ చ‌ల్

Rahul Sonia Viral : కాంగ్రెస్ అగ్ర నాయ‌కుడు రాహుల్ గాంధీ నెట్టింట్లో నిత్యం హాట్ టాపిక్ గా మారుతున్నారు. ఆయ‌న చేప‌ట్టిన భార‌త్ జోడో యాత్ర ఇప్పుడు ప్ర‌పంచ వ్యాప్తంగా ఆక‌ర్షిస్తోంది. ఓ వైపు జాతీయ మీడియా కావాల‌ని ప్ర‌చారం చేయ‌క పోయినా సోష‌ల్ మీడియా మాధ్య‌మం ద్వారా వ‌ర‌ల్డ్ వైడ్ గా మోస్ట్ పాపుల‌ర్ గా మారి పోయారు రాహుల్ గాంధీ.

ఆయ‌న చేప‌ట్టిన యాత్ర ఇప్ప‌టికే 9 రాష్ట్రాలు పూర్తి చేసుకుంది. 2,800 కు పైగా కిలోమీట‌ర్ల పాద‌యాత్ర‌ను ముగించారు. ఈ ఏడాది సెప్టెంబర్ 6న త‌మిళ‌నాడు లోని క‌న్యా కుమారి నుంచి ప్రారంభ‌మైంది. ఈ యాత్ర కాశ్మీర్ దాకా కొన‌సాగ‌నుంది. ప్ర‌స్తుతం యాత్ర‌కు విరామం ప్ర‌క‌టించారు.

ఈ స‌మ‌యంలో రాహుల్ గాంధీ సెంట‌ర్ ఆఫ్ అట్రాక్ష‌న్ గా మారారు. ఆయ‌న బుధ‌వారం హ‌ల్ చ‌ల్ చేశారు. తెల్ల‌టి టీ ష‌ర్ట్ తో ద‌ర్శ‌నం ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇవాళ 138వ వ్య‌వ‌స్థాప‌క దినోత్స‌వం. ఢిల్లీలోని పార్టీ ఆఫీసులో ఘ‌నంగా నిర్వ‌హించారు ఫార్మేష‌న్ డేను.

ఈ కార్య‌క్ర‌మానికి ఏఐసీసీ చీఫ్ మ‌ల్లికార్జున్ ఖ‌ర్గేతో పాటు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ(Rahul Sonia Viral)  హాజ‌ర‌య్యారు. సీనియ‌ర్లు కూడా పాల్గొన్న ఈ కార్య‌క్ర‌మంలో అనూహ్య ప‌రిణామం చోటు చేసుకుంది. రాహుల్ గాంధీకి త‌న త‌ల్లి సోనియా గాంధీ అంటే వ‌ల్ల‌మాలిన అభిమానం. ఆమె బుగ్గుల‌ను నిమురుతూ ఉండ‌డం కెమెరాల‌కు చిక్కింది.

ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. కాసేప‌ట్లోనే వైర‌ల్ గా మారాయి. ఎంతైనా త‌ల్లికి త‌గిన త‌న‌యుడిన‌ని నిరూపించారు రాహుల్ గాంధీ.

Also Read : యాత్ర‌కు ఆహ్వానం అంద‌లేదు

Leave A Reply

Your Email Id will not be published!