Sri Lanka T20 ODI Squad : శ్రీలంక టీ20..వ‌న్డే జ‌ట్ల ఎంపిక

కెప్టెన్ గా ద‌సున్ ష‌న‌క నియామ‌కం

Sri Lanka T20 ODI Squad : జ‌న‌వ‌రిలో భార‌త్ లో ప‌ర్య‌టించే శ్రీ‌లంక టీమ్ ను ప్ర‌క‌టించింది శ్రీ‌లంక క్రికెట్ బోర్డు. టూర్ లో భాగంగా శ్రీ‌లంక జ‌ట్టు టీమిండియాతో మూడు మ్యాచ్ ల టీ20 సీరీస్ తో పాటు మూడు వ‌న్డే మ్యాచ్ ల సీరీస్ ఆడ‌నుంది. జ‌న‌వ‌రి 3 నుంచి ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా ద‌సున్ ష‌న‌క కు సార‌థ్య బాధ్య‌త‌లు అప్ప‌గించింది బోర్డు. వ‌న్డే, టీ20 సీరీస్ లో ఆడేందుకు గాను 20 మంది స‌భ్యుల‌తో కూడిన టీమ్ ను అనౌన్స్ చేసింది.

ఇక ద‌సున్ ష‌న‌క‌కు స‌హాయంగా కుసాల్ మెండీస్ కు వైస్ కెప్టెన్ బాధ్య‌త‌ల‌ను అప్ప‌గించింది శ్రీ‌లంక సెలెక్ష‌న్ కమిటీ. జ‌ట్టుకు శ్రీ‌లంక క్రీడా, యువ‌జ‌న వ్య‌వ‌హారాల శాఖ మంత్రి రోష‌న్ ర‌ణ సింగ్ ఆమోదం తెలిపిన‌ట్లు శ్రీ‌లంక బోర్డు ప్ర‌క‌టించింది.

ఇక భార‌త్ లో ప‌ర్య‌టించే శ్రీ‌లంక జ‌ట్టులో (Sri Lanka T20 ODI Squad) ద‌సున్ ష‌న‌క కెప్టెన్ , పాతుమ్ నిస్సాం, అవిష్క ఫెర్నాండో , స‌దీర స‌మ‌ర వీక్ర‌మ, కుసాల్ మెండీస్ (వ‌న్డేకు వైస్ కెప్టెన్ ), భానుక రాజ‌ప‌క్స (టీ20 కి మాత్ర‌మే), చ‌రిత్ అస‌లంక , ధ‌నంజ‌య డిసిల్వా, వ‌నిందు హ‌స‌రంక (టీ20) , అషెన్ బండార‌, మ‌హేష్ తీక్ష‌ణ‌, జెఫ్రీ వాండ‌ర్నే (వ‌న్డే ) , చ‌మిక క‌రుణ ర‌త్నే , దిల్షాన్ మ‌ధు శంక‌, క‌సున్ ర‌జిత‌, నువానీడు ఫెర్నాండో (వ‌న్డే ) , దునిత్ వెల్ల‌ల‌గే, ప్ర‌మోద్ మ‌ధుష‌న్ , ల‌హిరు కుమార ను ఎంపిక చేసింది.

ఇదిలా ఉండ‌గా బీసీసీఐ ఇప్ప‌టికే శ్రీ‌లంక‌తో ఆడే జ‌ట్ల‌ను ఎంపిక చేసింది. టీ20 టీమ్ కు హార్దిక్ పాండ్యా సార‌థ్యం వ‌హిస్తుండ‌గా వ‌న్డే జ‌ట్లుకు రోహిత్ శ‌ర్మ కెప్టెన్ గా ఉన్నాడు.

Also Read : శాంస‌న్ కు అన్యాయం బీసీసీఐపై ఆగ్ర‌హం

Harmanpreet Kaur Lead : టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌హిళా జ‌ట్టు డిక్లేర్

Leave A Reply

Your Email Id will not be published!