Rishab Pant Injured : రోడ్డు ప్ర‌మాదం రిష‌బ్ పంత్ కు గాయం

డెహ్రాడూన్ ఆస్ప‌త్రిలో క్రికెట‌ర్ కు చికిత్స‌

Rishab Pant Injured : ప్ర‌ముఖ భార‌త క్రికెట‌ర్ ఢిల్లీ క్యాపిట‌ల్స్ కెప్టెన్ రిష‌బ్ పంత్ రోడ్డు ప్ర‌మాదానికి(Rishab Pant Injured) గుర‌య్యాడు. స్వంతంగా త‌న మెర్సిడెస్ కారును డ్రైవింగ్ చేస్తున్నాడు. రిష‌బ్ పంత్ శుక్ర‌వారం ఉద‌యం ఢిల్లీ నుండి ఉత్త‌రాఖాండ్ కు వెళుతుండ‌గా ఈ ప్ర‌మాదం చోటు చేసుకుంది.

కారు డివైడ‌ర్ ను ఢీకొట్టింది. దీంతో కారులో మంట‌లు చెల‌రేగాయి. ఇదిలా ఉండ‌గా ఉత్త‌రాఖండ్ లోని రూర్కీ స‌మీపంలో ప్ర‌మాదానికి గుర‌య్యాడు. తీవ్రంగా గాయ‌ప‌డిన రిష‌బ్ పంత్ ను హుటా హుటిన డెహ్రాడూన్ లోని మాక్స్ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.

ప్ర‌స్తుతం ఆయ‌న‌కు మెరుగైన చికిత్స‌ను అంద‌జేస్తున్నారు. అయితే ప్ర‌మాదం నుంచి బ‌య‌ట‌ప‌డ్డాడ‌ని, చికిత్స అందిస్తున్న‌ట్లు వైద్యులు వెల్ల‌డించారు. ఇదిలా ఉండ‌గా రిష‌బ్ పంత్(Rishab Pant Injured) త్వ‌ర‌గా కోలుకోవాలంటూ సోష‌ల్ మీడియా వేదిక‌గా క్రికెట్ అభిమానులు, క్రికెట‌ర్లు, మాజీ క్రికెట‌ర్లు, స‌హ‌చ‌ర ఆట‌గాళ్లు కోరారు.

నా సోద‌రుడికి ఏమీ కాద‌ని, తిరిగి మైదానంలోకి వ‌స్తాడ‌ని పేర్కొన్నాడు మాజీ క్రికెట‌ర్ వీరేంద్ర సెహ్వాగ్. ఇక ఇవాళ ఉద‌యం లేచిన వెంట‌నే రిష‌బ్ పంత్ గురించి వార్త తెలిసింది. అత‌డు క్షేమంగా ఉన్నాడ‌ని, త్వ‌ర‌గా కోలుకుంటాడ‌ని ఆశిస్తున్న‌ట్లు పేర్కొన్నాడు ప్ర‌ముఖ క్రికెట్ విశ్లేష‌కుడు హ‌ర్ష బోగ్లే. అయితే రిష‌బ్ పంత్ గురించి కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది ఢిల్లీ క్యాపిట‌ల్స్ యాజ‌మాన్యం.

రిష‌బ్ పంత్ హ‌రిద్వార్ జిల్లా లోని మంగ్లౌర్ , న‌ర్స‌న్ మ‌ధ్య ప్ర‌మాదానికి గుర‌య్యాడు. రూర్కీ లోని ప్రాథ‌మిక చికిత్స పొందాక‌..అత‌డిని మెరుగైన చికిత్స కోసం డెహ్రాడూన్ ఆస్ప‌త్రికి త‌ర‌లించిన‌ట్లు వెల్ల‌డించింది. ప్ర‌స్తుతానికి బాగానే ఉన్నాడ‌ని పేర్కొంది.

Also Read : ఫుట్‌బాల్ దిగ్గ‌జం పీలే క‌న్నుమూత

Leave A Reply

Your Email Id will not be published!