Tunisha Sharma Mother : షీజాన్ కు శిక్ష ప‌డే దాకా ఊరుకోను

తునీశా శ‌ర్మ త‌ల్లి వ‌నితా శ‌ర్మ శ‌ప‌థం

Tunisha Sharma Mother : యువ న‌టి త‌నీషా శ‌ర్మ ఆత్మ‌హ‌త్య వెనుక స‌హ న‌టుడు షీజాన్ ఖాన్ ఉన్నాడంటూ మ‌రోసారి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు త‌ల్లి వ‌నితా శ‌ర్మ‌. కేంద్ర మంత్రి రాందాస్ అథావ‌లే సంద‌ర్శించారు. శుక్ర‌వారం వ‌నితా శ‌ర్మ(Tunisha Sharma Mother) మీడియాతో మాట్లాడారు. షీజాన్ ఖాన్ కు శిక్ష ప‌డేంత వ‌ర‌కు తాను ఊరుకోన‌ని , పోరాటం చేస్తాన‌ని శ‌ప‌థం చేశారు.

తునీషా శ‌ర్మ‌కు ఓసీడీ త‌ప్ప వేరే వ్యాధి లేద‌న్నారు. ఆమె ప‌రిశుభ్ర‌త గురించి చాలా స్పృహ‌తో ఉంద‌ని చెప్పారు. నా బిడ్డ‌ను వాడు పొట్ట‌న పెట్టుకున్నాడంటూ ఆరోపించింది. ఇవాళ త‌న కూతురు బ‌లై పోయింద‌ని, రేపొద్దున మ‌రికొంద‌రు బ‌లికాకుండా ఉండేలా షీజాన్ కు క‌ఠిన శిక్ష ప‌డాల‌న్నారు వ‌నితా శ‌ర్మ‌.

ఇదిలా ఉండ‌గా డిసెంబ‌ర్ 24న ఒక టీవీ సీరియ‌ల్ సెట్ లో తునీషా శ‌ర్మ ఉరి వేసుకుని క‌నిపించింది. ఆమె మ‌ర‌ణించిన కొన్ని గంట‌ల్లోనే స‌హ న‌టుడు షీజాన్ ఖాన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. క‌స్ట‌డీలో విచారిస్తున్నారు. త‌మ‌కు స‌హ‌క‌రించ‌డం లేద‌ని ఆరోపించారు పోలీసులు. అందుక‌నే క‌స్ట‌డీ రోజులు పెంచాల‌ని కోరుతూ విన్న‌వించ‌డంతో కోర్టు అనుమ‌తించింది.

షీజాన్ ఖాన్ , తునీషా శ‌ర్మ గ‌త కొంత కాలంగా ల‌వ్ లో ఉన్నార‌ని తెలిపారు వ‌నితా శ‌ర్మ‌. 15 రోజుల కింద‌ట బ్రేక‌ప్ చెప్పాడు. పెళ్లి చేసుకుంటాన‌ని న‌మ్మించి మోసం చేశాడ‌ని, అంతే కాదు మతం మారాలంటూ ఒత్తిడి తెచ్చాడ‌ని ఆరోపించారు తునీషా శ‌ర్మ త‌ల్లి. త‌న కూతురు ఆ కుటుంబంతో క‌లిసి ఉంద‌న్నారు. ఇదే విష‌యంపై తాను నిల‌దీస్తే త‌న‌ను నిందించాడంటూ వ‌నితా శ‌ర్మ ఆరోపించారు.

Also Read : షీజ‌న్ ఖాన్ కు శిక్ష త‌ప్ప‌దు – అథ‌వాలే

Leave A Reply

Your Email Id will not be published!