Ronaldo Big Deal : సౌదీ ఫుట్ బాల్ క్ల‌బ్ తో రొనాల్డో బిగ్ డీల్

200 మిలియ‌న్ యూరోల కంటే ఎక్కువ

Ronaldo Big Deal : ప్ర‌పంచ ఫుట్ బాల్ దిగ్గ‌జం క్రిస్టియానో రొనాల్డో సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశాడు. సౌదీ అరేబియా క్ల‌బ్ అల్ నాస‌ర్ తో ఒప్పందం చేసుకున్నాడు. ఏకంగా భారీ డీల్(Ronaldo Big Deal)  కుదిరింది. ఇందులో భాగంగా 200 యూరో మిలియ‌న్ల కంటే ఎక్కువ‌గా. ఇందుకు సంబంధించి సౌదీ అరేబియా ఫుట్ బాల్ అరేబియా క్లబ్ అల్ నాస‌ర్ అధికారికంగా ప్ర‌క‌టించింది.

ఇటీవ‌లే ఖ‌తార్ వేదిక‌గా ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2022 స‌క్సెస్ ఫుల్ గా నిర్వ‌హించింది. కాగా 200 మిలియ‌న్ యూరోల కంటే ఎక్కువ ధ‌ర‌కు అగ్రిమెంట్ చేసుకున్న‌ట్లు తెలిపింది ఫుట్ బాల్ క్ల‌బ్. ప్ర‌స్తుతం క్రిస్టియానో రొనాల్డో కు 37 ఏళ్లు. సౌదీ అరేబియా క్ల‌బ్ తో 2025 వ‌ర‌కు ఒప్పందం చేసుకున్నాడు.

ఈ ఒప్పందం మూడేళ్ల పాటు కొన‌సాగ‌నుంది. వేరే దేశంలో కొత్త ఫుట్ బాల్ లీగ్ ని కొనుగోనేందుకు తాను వేచి ఉండ‌లేన‌ని మాజీ మాంచెస్ట‌ర్ యునైటెడ్ , రియ‌ల్ మాడ్రిడ్ , జువెంట‌స్ పేర్కొన్నాడు. పోర్చుగీస్ స్టార్ అల్ నాస్ర్ ట్విట్ట‌ర్ వేదిక‌గా స్పందించాడు. ప‌సుపు రంగు చొక్కా ప‌ట్టుకున్నాడు.

వెనుక వైపు నుంచి ఇష్ట‌మైన సంఖ్య 7 ధ‌రించాడు. అల్ నాస‌ర్ తో ప‌ని చేసే దృక్ప‌థం స్పూర్తి దాయ‌కంగా ఉండ‌బోతోంద‌ని అనుకుంటున్నా. నా స‌హ‌చ‌రుల‌తో క‌లిసి ఆడేందుకు నేను వేచి చూస్తున్నాన‌ని స్ప‌ష్టం చేశాడు క్రిస్టియానో రొనాల్డో(Ronaldo Big Deal) . తామంతా క‌లిసి గొప్ప విజ‌యాన్ని సాధించ గ‌ల‌మ‌న్న న‌మ్మ‌కం త‌న‌కు ఉంద‌ని పేర్కొన్నాడు దిగ్గ‌జ ఫుట్ బాలర్.

రొనాల్డో ప్ర‌పంచ క‌ప్ లో పోర్చుగ‌ల్ తో ఉన్న‌ప్పుడు యుకె అత‌డితో ఉన్న ఒప్పందాన్ని ర‌ద్దు చేసుకుంది.

Also Read : సంజూ శాంస‌న్ ద‌మ్మున్నోడు – సంగ‌క్క‌ర

Leave A Reply

Your Email Id will not be published!