Ram Gopal Varma Wishes : వెరైటీ విషెస్ చెప్పిన ఆర్జీవీ
కొత్త ఏడాదికి స్వాగతం
Ram Gopal Varma Wishes : వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో తనకు తానే సాటి మరోసారి నిరూపించుకున్నారు దిగ్గజ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అలియాస్ ఆర్జీవీ. ఏది మాట్లాడినా లేక ఏ ట్వీట్ చేసినా..దేని గురించి ప్రస్తావించినా క్షణాల్లో వైరల్ అయ్యే ఏకైక డైరెక్టర్ వర్మనే.
నూతన సంవత్సరం సందర్భంగా సెలబ్రిటీలు సాధారణంగా స్పందిస్తే రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma Wishes) మాత్రం భిన్నంగా స్పందించడం విశేషం.
రామూ మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నారు. ఈ కొత్త సంవత్సరం 2023లో అందరికీ శుభాకాంక్షలు చెబుతున్నానని అనుకుంటున్నారా..లేదు .. నా ఒక్కడికి మాత్రమే నేను గ్రీటింగ్స్ చెబుతున్నానంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఆర్జీవీ చేసిన ట్వీట్ నెట్టింట్లో వైరల్ గా మారింది. శివ సినిమాతో తెలుగు సినిమా రంగాన్ని దుమ్ము రేపిన ఈ దర్శకుడు ముంబై మహా నగరాన్ని తన టేకింగ్ తో మెస్మరైజ్ చేశాడు.
సినిమా రంగానికి సంబంధించి 24 క్రాఫ్ట్స్ ను అలవోకగా చెప్పే ఏకైక దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏది చేసినా సంచలనమే. ఆయన ఎక్కువగా నీషేను, ఆయాన్ రాండ్ ను ఇష్టపడతాడు. వారి ప్రభావం తన మీద ఉందని ఇప్పటికే చాలా సార్లు చెప్పుకున్నాడు. ఆర్జీవీ ఫ్యాక్టరీ నుంచి వచ్చిన వాళ్లు దిగ్గజ దర్శకులయ్యారు. ఆయనకు ఫ్యాన్స్ అయ్యారు.
వారిలో పూరీ జగన్నాథ్ , కృష్ణ వంశీ, శివ నాగేశ్వర్ రావు ..ఇలా చెప్పుకుంటూ పోతే ఎందరో ఉన్నారు. ప్రధానంగా బాలీవుడ్ లో ఆర్జీవీ అంటేనే ఓ ట్రెండ్. సాధారణమైన వ్యక్తుల్ని స్టార్లుగా చేసిన ఘనత రామూదే.
Also Read : ఈరోజే ముఖ్యం రేపటితో అనవసరం
