Sheejan Khan Mother : తునీషా శర్మ తల్లి ఆరోపణలు అబద్దం
షీజాన్ ఖాన్ తల్లి, సోదరి కామెంట్స్
Sheejan Khan Mother : యువ నటి తునీషా శర్మ సీరియల్ సెట్ లో ఆత్మహత్యకు పాల్పడడం కలకలం రేపింది. ఈ ఘటన దేశ వ్యాప్తంగా చర్చకు దారి తీసింది. తన కూతురిని వేధింపులకు గురి చేసి, సూసైడ్ చేసుకునేలా చేశాడని కో స్టార్ షీజాన్ ఖాన్ పై నిప్పులు చెరిగింది తునీషా శర్మ తల్లి వనితా శర్మ.
దీంతో షీజాన్ ఖాన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆరు రోజుల కస్టడీకి తీసుకున్నారు. కానీ పోలీసులకు సహకరించడం లేదని సమాచారం. ఇదే సమయంలో సంచలన ఆరోపణలు చేశారు వనితా శర్మ. పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చాడని, ఆ తర్వాత బ్రేకప్ చెప్పాడని, సెట్ లోనే తన కూతురి చెంపపై కొట్టాడని వాపోయింది.
డ్రగ్స్ కు అలవాటు పడిన షీజాన్ ఖాన్ కు ఎంతో మంది అమ్మాయిలతో సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు వనితా శర్మ. తన కూతురు చావుకు కోస్టారే కారణమని వాపోయారు. ఈ తరుణంలో వనితా శర్మ చేసిన ఆరోపణలు వాస్తవం కాదన్నారు షీజాన్ ఖాన్ తల్లి(Sheejan Khan Mother) , సోదరి. సోమవారం వారు మొదటిసారిగా మీడియా ముందుకు వచ్చారు.
తమ కొడుకును కావాలని ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు వనితా శర్మపై. తాము తునీషా శర్మను బలవంతంగా హిజాబ్ ధరించమని కోరలేదన్నారు. తునీషా తల్లి తనకు ఎన్నిసార్లు ఫోన్ చేసిందో అందరికీ తెలుసన్నారు షీజాన్ ఖాన్ తల్లి ఫలక్ నాజ్ . ఆమెతో పాటు ఇద్దరు సోదరణీమలు కూడా పాల్గొన్నారు. వనితా శర్మ తమ కుటుంబంలో సభ్యులుగా ఉన్నారని తెలిపారు.
Also Read : నరేష్..పవిత్ర లిప్ కిస్ వైరల్