IND vs SL 3rd T20 : భార‌త్ శ్రీ‌లంక బిగ్ ఫైట్

టీ20 సీరీస్ తేల్చేది నేడే

IND vs SL 3rd T20 : టీ20 సీరీస్ విజేత ఎవ‌రో తేల్చే కీల‌క‌మైన మూడో టీ20 మ్యాచ్ కు వేదిక కానుంది రాజ్ కోట్. ఇప్ప‌టికే హార్దిక్ పాండ్యా సార‌థ్యంలోని టీమిండియా ముంబైలో జ‌రిగిన తొలి టీ20 మ్యాచ్ లో 2 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించింది. ఇక పుణె వేదిక‌గా జ‌రిగిన రెండో టీ20 మ్యాచ్ లో పేల‌వ‌మైన బౌలింగ్ ప్ర‌ద‌ర్శ‌నతో 16 ప‌రుగుల తేడాతో ఓట‌మి పాలైంది.

దీంతో ఇవాళ జ‌రిగే మ్యాచ్ ఇరు జ‌ట్ల‌కు కీల‌కం కానుంది. ఇందులో ఎవ‌రు గెలిస్తే వారే టీ20 సీరీస్ వ‌శ‌మ‌వుతుంది. రోహిత్ శ‌ర్మ‌, కేఎల్ రాహుల్ , విరాట్ కోహ్లీ లేకుండానే భార‌త్(IND vs SL 3rd T20) బ‌రిలోకి దిగింది. మొద‌టి మ్యాచ్ లో దీప‌క్ హూడా , అక్ష‌ర్ ప‌టేల్ రాణిస్తే రెండో మ్యాచ్ లో అక్ష‌ర్ ప‌టేల్ , సూర్య కుమార్ యాద‌వ్ రాణించినా ఫ‌లితం లేక పోయింది.

కీల‌క‌మైన ఆట‌గాడు సంజూ శాంస‌న్ కు గాయం కావ‌డంతో ఈ సీరీస్ కు పూర్తిగా దూర‌మ‌య్యాడు. అత‌డి స్థానంలో రాహుల్ త్రిపాఠిని తీసుకున్నాడు కెప్టెన్ హార్దిక్ పాండ్యా. ఇక ఇరు జ‌ట్లు స‌మ‌రానికి సిద్ద‌మ‌య్యాయి.

ఇక జ‌ట్టు ప‌రంగా చూస్తే హార్దిక్ పాండ్యా (కెప్టెన్ ) , శుభ్ మ‌న్ గిల్ , సూర్య కుమార్ యాద‌వ్ , ఇషాన్ కిష‌న్ , రాహుల్ త్రిపాఠి, దీప‌క్ హూడా, అక్ష‌ర్ ప‌టేల్ , శివ‌మ్ మావి, హ‌ర్ష‌ల్ ప‌టేల్ , ఉమ్రాన్ మాలిక్ , అర్ష్ దీప్ సింగ్ , యుజ్వేంద్ర చాహ‌ల్ ఆడ‌నున్నారు.

శ్రీ‌లంక జ‌ట్టులో ఎలాంటి మార్పులు ఉండ‌క పోవ‌చ్చు. టీమ్ ప‌రంగా చూస్తే ధ‌నుస్ ష‌న‌క కెప్టెన్ కాగా పాతుమ్ నిస్సాం, కుస‌ల్ మెండీస్ , భానుక రాజ‌ప‌క్సే , చ‌రిత అస‌లంక‌, వ‌నిందు హ‌స‌రంగా, ధ‌నంజ‌య్ డిసిల్వ‌, మ‌హేష్ తీక్ష‌ణ‌, క‌సున్ ర‌చిత‌, దిల్ష‌న్ మ‌ధుశంక ఉన్నారు.

Also Read : పంత్ కు గాయం వార్న‌ర్ కు ప‌ట్టం

Leave A Reply

Your Email Id will not be published!