David Warner Pant : పంత్ కు గాయం వార్న‌ర్ కు ప‌ట్టం

ఢిల్లీ క్యాపిట‌ల్స్ యాజ‌మాన్యం ప్లాన్

David Warner Pant : ఈ ఏడాది 2023లో జ‌రిగే ఇండియ‌న్ ప్రిమీయ‌ర్ లీగ్ లో ఆడే ఢిల్లీ క్యాపిట‌ల్స్ కు ఆస్ట్రేలియా స్టార్ బ్యాట‌ర్ డేవిడ్ వార్న‌ర్ సార‌థ్యం వ‌హించ‌నున్నాడు. ఇప్ప‌టి దాకా కెప్టెన్ గా ఉన్న భార‌త క్రికెట‌ర్ రిష‌బ్ పంత్ ఊహించ‌ని రీతిలో ప్ర‌మాదానికి గుర‌య్యాడు. ఢిల్లీ నుండి రూర్కీకి వెళుతుండ‌గా కారు డివైడ‌ర్ కు ఢీకొన‌డంతో బ‌తికి బ‌య‌ట ప‌డ్డాడు.

ప్ర‌స్తుతం ముంబై ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇంకా శ‌స్త్ర చికిత్స చేయాల్సి ఉంద‌ని స‌మాచారం. ఇందు కోసం లండ‌న్ కు పంపించేందుకు ఏర్పాట్లు చేస్తోంది భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ). దీంతో రిష‌బ్ పంత్ కు(Rishab Pant) బ‌దులు ఎవ‌రిని కెప్టెన్ గా చేయాల‌నే దానిపై మ‌ల్ల‌గుల్లాలు ప‌డుతోంది ఢిల్లీ క్యాపిట‌ల్స్.

ఇప్ప‌టికే ఆస్ట్రేలియా జ‌ట్టుకు సార‌థిగా, ఇండియ‌న్ ప్రిమీయ‌ర్ లీగ్ (ఐపీఎల్)లో స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుకు నాయ‌కుడిగా ఉన్న డేవిడ్ వార్న‌ర్ కే ప‌గ్గాలు అప్ప‌గించాల‌ని(David Warner) ఢిల్లీ క్యాపిట‌ల్స్ యాజ‌మాన్యం డిసైడ్ అయిన‌ట్లు స‌మాచారం. జ‌ట్టులో ప‌లువురు కీల‌క ఆట‌గాళ్లు ఉన్న‌ప్ప‌టికీ వార్న‌ర్ వైపు మొగ్గు చూపుతున్న‌ట్లు ఢిల్లీ క్యాపిట‌ల్స్ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి.

ఎస్ఆర్ హెచ్ ను ఐపీఎల్ ఛాంపియ‌న్ గా నిలిపాడు వార్న‌ర్. కానీ అనుకోని రీతిలో అత‌డిని అవ‌మాన‌క‌ర‌మైన రీతిలో త‌ప్పించింది. అయినా ఎక్క‌డా నోరు జార‌లేదు డేవిడ్ వార్న‌ర్.

ఇదిలా ఉండ‌గా రిష‌బ్ పంత్ త్వ‌ర‌గా కోలుకోవాల‌ని కోరుతూ స్పెష‌ల్ పోస్టు పెట్టాడు డేవిడ్ వార్న‌ర్. డియ‌ర్ భ‌య్యా గెల్ వెల్ సూన్ అంటూ పేర్కొన్నాడు.

Also Read : భార‌త్ శ్రీ‌లంక బిగ్ ఫైట్

Leave A Reply

Your Email Id will not be published!