Jameela Jamil Rishi Sunak : రిషి నిర్వాకం స్వేచ్ఛ‌పై ఉక్కుపాదం

స్వేచ్ఛ‌ను అణిచి వేసే కుట్ర

Jameela Jamil Rishi Sunak : హాలీవుడ్ న‌టి జ‌మీలా జ‌మీల్ సంచ‌ల‌న కామెంట్స్ చేసింది. ఆమె ఏకంగా బ్రిట‌న్ ప్ర‌ధాన మంత్రి , ప్ర‌వాస భార‌తీయుడైన రిషి సునాక్ ను ఏకి పారేసింది. అన‌రాని మాట‌ల‌తో నిప్పులు చెరిగింది. స్వేచ్చ‌ను త‌ట్టుకోలేక నిర్బంధాన్ని అమ‌లు చేయాల‌ని అనుకుంటున్నాడ‌ని ఆరోపించింది.

రిషి సునాక్ ఓ సంప‌న్న‌మైన ప్ర‌ధాన‌మంత్రి అంటూ పేర్కొంది. ఇన్ స్టా గ్రామ్ హ్యాండిల్ లో కీల‌క‌మైన వ్యాఖ్య‌లు చేస్తూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ప్ర‌స్తుతం జ‌మీలా జ‌మీల్(Jameela Jamil)  చేసిన వ్యాఖ్య‌లు క‌ల‌క‌లం రేపుతున్నాయి. మీడియాలో చెప్ప‌లేని విధంగా బండ బూతులు తిట్టింది రిషి సునాక్ ను. ప్ర‌జ‌లు త‌మ స‌మ‌స్య‌ల‌ను చెప్పనీయ‌డం లేద‌ని ఆరోపించింది.

ఇలాగేనా పాల‌న సాగించేదంటూ మండిప‌డింది జ‌మీలా జ‌మీల్. త‌మ న్యాయ‌ప‌ర‌మైన డిమాండ్ల సాధ‌న కోసం బ‌య‌ట‌కు వ‌చ్చేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్న వారిని పీఎం టార్గెట్ చేస్తున్నాడంటూ ధ్వ‌జ‌మెత్తింది. ఏదో ఒక రోజు ప‌ద‌వి నుంచి దిగి పోవాల్సి వ‌స్తుంద‌ని హెచ్చ‌రించింది. దేశంలో క‌నీసం స‌మ్మె చేసే హ‌క్కు లేక పోతే ఈ ప్ర‌భుత్వం ఎందుకు ఉన్న‌ట్లు అని జ‌మీలా జ‌మీల్(Jameela Jamil)  ప్ర‌శ్నించింది.

ప్రపంచానికి నీతులు చెప్పాల‌ని అనుకుంటున్న రిషి సున‌క్ కు ఏం అర్హ‌త ఉందంటూ నిల‌దీసింది హాలీవుడ్ న‌టి. ఇప్పుడు ఆమె చేసిన కామెంట్స్ సోష‌ల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఇక‌నైనా పీఎం మారాల‌ని లేక పోతే త్వ‌ర‌లోనే ప‌ద‌వి నుంచి త‌ప్పుకోవాల్సి వ‌స్తుంద‌ని హెచ్చ‌రించింది. దీనిపై ఇంకా స్పందించ లేదు బ్రిట‌న్ పీఎం జ‌మీలా జ‌మీల్.

Also Read : వాయిస్ ఆఫ్ గ్లోబ‌ల్ సౌత్ గా భార‌త్

Leave A Reply

Your Email Id will not be published!