Women IPL 2023 : మ‌హిళా క్రికెట‌ర్ల‌కు బంప‌ర్ ఆఫ‌ర్

ఫిబ్ర‌వ‌రి లో ఐపీఎల్ వేలం

Women IPL 2023 : ప్ర‌పంచ క్రికెట్ లో ఇండియ‌న్ ప్రిమీయ‌ర్ లీగ్ కు ఉన్నంత క్రేజ్ ఏదానికీ లేదు. అందుకే దానికి అంత ప్ర‌యారిటీ. ఇప్ప‌టికే భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు పురుషుల ఐపీఎల్ ను నిర్వ‌హిస్తూ వ‌స్తోంది. 2008లో దానిని ల‌లిత్ మోదీ ప్రారంభించారు. ఆనాటి నుంచి నిర‌వ‌ధికంగా కొన‌సాగుతూ కోట్లాది ఆదాయ‌న్ని స‌మ‌కూర్చేలా చేస్తోంది. దీనిని గ‌మ‌నించిన బీసీసీఐ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.

ఇందుకు గాను మ‌హిళా ఐపీఎల్ ను(Women IPL 2023)  ప్ర‌వేశ పెట్టింది. ఈ మేర‌కు విధి విధానాలు ఖ‌రారు చేసింది. మొద‌ట‌గా అయిదు జ‌ట్ల‌ను ఖ‌రారు చేసింది. ఇప్ప‌టికే ద‌ర‌ఖాస్తులకు ఆహ్వానం ప‌లికింది. ఈనెల 21న ఆఖ‌రు తేది. ఇప్ప‌టికే పురుషుల ఐపీఎల్ లో ఉన్న ఫ్రాంచైజీల‌లో చెన్నై సూప‌ర్ కింగ్స్ , రాజ‌స్థాన్ రాయ‌ల్స్ , ఢిల్లీ క్యాపిట‌ల్స్ , కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ , పంజాబ్ కింగ్స్ ఎలెవ‌న్ పోటీ ప‌డుతున్నాయి.

మార్చిలో ఐపీఎల్ ఛాంపియ‌న్ షిప్ లీగ్ కొన‌సాగుతుంది. ఇందుకు బీసీసీఐ భారీగా ప్లాన్ వేసింది. ఐపీఎల్ తొలి సీజ‌న్ కు మ‌హిళా క్రికెట‌ర్ల‌ను వేలం పాట ద్వారా ఎంపిక చేస్తారు. ఇంకా తేదీలు ఖ‌రారు చేయ‌లేదు. క్యాప్డ్ , అన్ క్యాప్డ్ గా విభ‌జించింది బీసీసీఐ. ఈ నెల 26 సాయంత్రం వ‌ర‌కు గ‌డువు విధించింది.

ప్లేయ‌ర్ల బేస్ ధ‌ర‌లు కూడా నిర్ణ‌యించింది. క్యాప్డ్ ప్లేయ‌ర్ల‌కు సంబంధంచి రూ. 50 ల‌క్ష‌లు, రూ. 40 ల‌క్ష‌లు, రూ. 30 ల‌క్ష‌లుగా చేసింది. అన్ క్యాప్డ్ ఆట‌గాళ్ల‌కు సంబంధించి బేస్ ధ‌ఱ‌ను రూ. 20 ల‌క్ష‌లు, రూ. 10 ల‌క్ష‌లుగా ఖ‌రారు చేసింది బీసీసీఐ. ఇదిలా ఉండ‌గా మ‌హిళ‌ల ఐపీఎల్ మీడియా హ‌క్కుల వేలాన్ని వాయిదా వేసింది.

Also Read : చేత‌న్ శ‌ర్మ ముందు స‌వాళ్లు ఎన్నో

Leave A Reply

Your Email Id will not be published!