Sunil Gavaskar Virat Kohli : 100 సెంచ‌రీలు కోహ్లీకి సాధ్యం

సునీల్ మ‌నోహ‌ర్ గ‌వాస్క‌ర్ కామెంట్స్

Sunil Gavaskar Virat Kohli : భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ కెప్టెన్, ప్ర‌ముఖ కామెంటేట‌ర్ సునీల్ మ‌నోహ‌ర్ గ‌వాస్క‌ర్(Sunil Gavaskar)  సంచ‌ల‌న కామెంట్స్ చేశాడు. ఇటీవ‌ల ఫామ్ కోల్పోయి నానా తంటాలు ప‌డిన ర‌న్ మెషీన్ విరాట్ కోహ్లీని ఆకాశానికి ఎత్తేశాడు. త్వ‌ర‌లోనే 100 సెంచ‌రీలు సాధించ‌డం అత‌డికి మాత్ర‌మే సాధ్య‌మ‌ని స్ప‌ష్టం చేశాడు గ‌వాస్క‌ర్.

ఆ స‌త్తా అత‌డికి ఒక్క‌డికే ఉంద‌ని పేర్కొన్నాడు. ఇప్ప‌టి వ‌ర‌కు వేలాది ప‌రుగుల జాబితాలో ప్ర‌పంచంలోనే నెంబ‌ర్ వ‌న్ ప్లేస్ లో ఉన్నాడు స‌చిన్ టెండూల్క‌ర్. ఇక అత‌డి అప్ర‌హ‌తిత రికార్డ్ ను బ్రేక్ చేసే స‌త్తా కేవ‌లం విరాట్ కోహ్లీకి మాత్ర‌మే ఉంద‌ని మ‌రోసారి స్ప‌ష్టం చేశాడు సునీల్ గ‌వాస్క‌ర్.

రెండు సంవ‌త్స‌రాలుగా పేల‌వ‌మైన ఫామ్ లేమితో నానా తంటాలు ప‌డ్డాడు విరాట్ కోహ్లీ. కానీ గ‌త కొంత కాలం నుంచి మ‌ళ్లీ తిరిగి ఫామ్ లోకి వ‌చ్చాడు. సెంచ‌రీల మోత మోగిస్తున్నాడు. గ‌త ఏడాది 2022లో ఆస్ట్రేలియాలో జ‌రిగిన టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో దుమ్ము రేపాడు. అత్య‌ధిక ప‌రుగుల వీరుడిగా నిలిచాడు.

మ‌రో వైపు కొత్త ఏడాది 2023లో వ‌న్డే సీరీస్ లో రెండు సెంచ‌రీలు చేసి త‌న‌కు ఎదురే లేద‌ని చాటాడు. భార‌త దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు 20 సెంచ‌రీలు చేసిన ఘ‌న‌త స‌చిన్ పై ఉంది. దానిని విరాట్ కోహ్లీ అధిగ‌మించాడు విరాట్ కోహ్లీ(Virat Kohli). ఇప్ప‌టి వ‌ర‌కు త‌న కెరీర్ లో 75 సెంచ‌రీలు చేశాడు. ఇంకా 25 సెంచ‌రీలు చేస్తే స‌చిన్ ను అధిగ‌మించే ఛాన్స్ ఉంది. ఈ సంద‌ర్భంగా గ‌వాస్క‌ర్ మాత్రం కోహ్లీ సాధిస్తాడ‌ని ఆ న‌మ్మ‌కం త‌న‌కు ఉంద‌న్నాడు.

Also Read : మైఖేల్ బ్రేస్ వెల్ షాన్ దార్ ఇన్నింగ్స్

Leave A Reply

Your Email Id will not be published!