Sarfaraz Khan : స‌ర్ఫ‌రాజ్ ఖాన్ షాకింగ్ కామెంట్స్

హాస్యాస్ప‌ద వ్యాఖ్య‌ల‌పై ఆగ్ర‌హం

Sarfaraz Khan : దేశీవాళి క్రికెట్ లో దుమ్ము రేపుతూ ప‌రుగుల వ‌ర‌ద పారిస్తున్నాడు స‌ర్ఫ‌రాజ్ ఖాన్. సెంచ‌రీల‌తో ఆక‌ట్టుకుంటున్నా ఎందుక‌నో భార‌త సెలెక్ష‌న్ క‌మిటీ చైర్మ‌న్ చేత‌న్ శ‌ర్మ‌ను మెప్పించ లేక పోతున్నాడు. దీనిపై పెద్ద రాద్దాంతం చోటు చేసుకుంది. ప్ర‌స్తుతం అద్బుతంగా రాణిస్తున్నా సెలెక్ట‌ర్లు ప‌క్క‌న పెట్టిన ఆట‌గాళ్ల‌లో మొద‌టి ఆట‌గాడు కేర‌ళ స్టార్ క్రికెట‌ర్ సంజూ శాంస‌న్ అయితే మ‌రొక‌రు స‌ర్ఫ‌రాజ్ ఖాన్(Sarfaraz Khan).

ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదిక‌గా జ‌రిగిన మ్యాచ్ లో అద్భుత‌మైన సెంచ‌రీ సాధించాడు. ఆపై వేళ్లు చూపెట్టాడు. అది సెలెక్ట‌ర్ల‌ను ఉద్దేశించి అలా చేశాడ‌న్న ఆరోప‌ణ‌లు లేక పోలేదు. మ‌రో వైపు తాజా, మాజీ ఆటగాళ్లు స‌ర్ఫ‌రాజ్ ఖాన్ ను జ‌ట్టులోకి తీసుకోవాల‌ని కోరుతున్నారు.

ఈ త‌రుణంలో తాను టెస్టు జ‌ట్టుకు ఎంపిక అవుతాన‌ని అనుకున్నాన‌ని కంట త‌డి పెట్టాడు. అది వైర‌ల్ గా మారింది. ఈ త‌రుణంలో తాను చీఫ్ సెలెక్ట‌ర్ చేత‌న్ శ‌ర్మ‌ను క‌లిశాన‌ని, ఆయ‌న హామీ కూడా ఇచ్చారంటూ తెలిపాడు. దీనిపై సీరియ‌స్ గా స్పందించాడు ముంబై మాజీ స్కిప్ప‌ర్ మిలింద్ రేగే.

త‌న నిరుత్సాహాన్ని బ‌హిరంగ వేదిక‌ల‌పై వ్య‌క్తం చేయ‌డం కంటే ప‌రుగులు సాధించ‌డంపై స‌ర్ఫ‌రాజ్ ఖాన్ ఫోక‌స్ పెడితే బెట‌ర్ అని సూచించాడు. దీనిపై తీవ్రంగా మండిప‌డ్డాడు ఆట‌గాడు స‌ర్ఫ‌రాజ్ ఖాన్(Sarfaraz Khan). ఇలాంటి చౌక‌బారు, హాస్యాస్ప‌ద వ్యాఖ్య‌లు ఇక నుంచి చేయొద్దంటూ సూచించాడు. ప్ర‌స్తుతం స‌ర్ఫ‌రాజ్ ఖాన్ చేసిన ట్వీట్ వైర‌ల్ గా మారింది.

Also Read : మ‌హిళా రెజ్ల‌ర్ల మీటూ ఉద్య‌మం

Leave A Reply

Your Email Id will not be published!